• తాజా వార్తలు

ఆరేళ్ల‌కే యూ ట్యూబ్‌లో ఏడాదికి 70 కోట్లు సంపాదిస్తున్న పిల్లాడి గురించి తెలుసా? 

ఆ పిల్లాడి వ‌య‌సు ఆరేళ్లు. మామూలుగా ఆ వ‌య‌సుకు పిల్ల‌లు బొమ్మ‌ల‌తో ఆడుకుంటారు. అమెరికాకు చెందిన ర‌యాన్ ఆరేళ్ల పిల్లాడు కూడా అదే చేస్తున్నాడు. కాక‌పోతే త‌న ఆట‌వ‌స్తువుల గురించి ఎక్స్‌ప‌ర్ట్‌లా రివ్యూలు ఇస్తాడు.  ఇత‌ని రివ్యూస్‌ను Ryan Toysreview  పేరిట యూట్యూబ్‌లో ఓ ఛాన‌ల్ పెట్టేశారు వాళ్ల అమ్మానాన్న‌.  ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ 10 హయ్య‌స్ట్ ఎర్నింగ్ వెబ్‌సైట్ల‌లో నిలిచి రికార్డులు సృష్టిస్తోంది.  

కోటి మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లు

2015లో స్టార్ట్ చేసిన ర‌యాన్‌ ఛాన‌ల్‌కు యూట్యూబ్‌లో కోటి మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.   లాస్ట్ ఇయ‌ర్ ర‌యాన్ ఈ ఛాన‌ల్ మీద ఏకంగా 70 కోట్లు సంపాదించాడు.  ప్ర‌పంచంలో ధ‌న‌వంతులు, శ‌క్తిమంతుల లెక్క‌లు ప్ర‌క‌టించే ప్ర‌ముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇత‌న్ని 2017లో  టాప్ 10 హ‌య్య‌స్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్ లిస్ట్‌లో చోటిచ్చింది. 
టాప్ 10 హ‌య్య‌స్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్ లిస్ట్ ఇదీ.. 
1.  డేనియ‌ల్ మిడిల్‌ట‌న్ :  ఈ బ్రిటిష్ మైన్‌క్రాఫ్ట్ ప్లేయ‌ర్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్  DanTDM  ద్వారా నెంబ‌ర్ వ‌న్ పెయిడ్ స్టార్‌గా నిలిచాడు.  1100 కోట్ల లైఫ్‌టైం వ్యూస్‌తో ఈ ఛాన‌ల్ దూసుకుపోతుంది. లాస్ట్ ఇయ‌ర్ మిడిల్‌ట‌న్ సంపాద 100.6 కోట్ల రూపాయ‌లు.  
 2) ఇవాన్ ఫాంగ్: ఫ‌న్నీ గేమ్ స్కిట్స్‌తో యూట్యూబ్ వ్యూయ‌ర్స్‌కి బాగా ప‌రిచం ఉన్న ఇవాన్ ఫాంగ్ VanossGaming ఛానల్ ద్వారా సెకండ్ ప్లేస్ సాధించాడు. 800 కోట్ల లైఫ్‌టైం వ్యూస్‌,  2కోట్ల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఈ ఛాన‌ల్‌కు ఉన్నాయి. ఫాంగ్ ఆదాయం 99 కోట్లు.
3) డ్యూడ్ ప‌ర్‌ఫెక్స్:  ఐదుగురు ఫ్రెండ్స్ క‌లిసి యూట్యూబ్ ఆడియ‌న్స్‌ను ఇంప్రెస్ చేయ‌డానికి చేసే క్రేజీ స్టంట్స్‌, స్టుపిడ్ ట్రిక్స్ ఈ లిస్ట్‌లో థ‌ర్డ్ ప్లేస్ కొట్టేశాయి. సంపాద‌న ఇంచుమించుగా 90 కోట్లు  
4, 5) మార్క్ ఫిష్‌బ్యాక్, లోగాన్‌పాల్‌:  గేమ‌ర్ మార్క్ ఫిష్చ్ బ్యాక్ నేటి యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకునే పాపుల‌ర్ గేమ్స్‌తో నాలుగో స్థానంలో, వ్లోగ‌ర్ లాగాన్ పాల్ ఐదో ప్లేస్‌లో ఉన్నారు. వీరి  సంపాద‌న 80 కోట్లు   

6) ఫెలిక్స్ క్జెల్‌బ‌ర్గ్ :  గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఫోర్బ్స్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచిన ఫెలిక్స్ కాంట్ర‌వ‌ర్సీలతో వెన‌క‌బ‌డి 6వ ప్లేస్‌కు ప‌డిపోయాడు. ఆదాయం సుమారు 77 కోట్లు.  
7)  జేక్ పాల్ :  డిస్నీలాంటి ఛాన‌ల్స్‌లో స్టారింగ్ చేసిన జేక్ పాల్ 74 కోట్లు సంపాదించాడు. 
 8, 9):  ఆంటోనీ ప‌డిల్లా, ఇయాన్ హెకాక్స్ త‌మ  Smosh ఛాన‌ల్ ద్వారా 8వ ప్లేస్‌లో నిలిచారు.  ToysReviewతో ర‌యాన్ 9వ ప్లేస్‌లో ఉన్నాడు. వీళ్ల సంపాద‌న  ఇంచుమించుగా 71 కోట్లు.  
10) లిల్లీసింగ్‌: ప‌ంజాబీ త‌ల్లిదండ్ర‌లు క్యారెక్ట‌ర్ల‌తో క్యామెడీ స్కెచెస్ వేసే లిల్లీసింగ్ ఫోర్బ్స్ లిస్ట్‌లో ప‌దో ప్లేస్ సాధించాడు. సంపాద‌న 67.5 కోట్లు  

జన రంజకమైన వార్తలు