• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో సెల్ల‌ర్ అవ‌డానికి 5 ఈజీ స్టెప్స్‌..  మీకోసం

ఇప్పుడంతా ఈ- కామ‌ర్స్ రాజ్యం.  బొమ్మ కారు ద‌గ్గ‌ర నుంచి నిజం కారు వ‌ర‌కు, పప్పులు, ఉప్పుల నుంచి   ఫ్రిజ్జుల‌, టీవీల వ‌ర‌కూ అన్నింటికీ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి కొనేసుకోవ‌చ్చు. భోగి మంట‌ల్లో వేయ‌డానికి ఆవు పిడ‌క‌లు కూడా అమ్మే స్థాయికి ఆన్‌లైన్ బిజినెస్ డెవ‌ల‌ప్ అయిపోయింది.  అందుకే ఈ ట్రెండ్‌ను మీరూ అందిపుచ్చుకోండి. బిజినెస్ చేసే ఇంట్రెస్ట్‌, ఆలోచ‌న మీకుంటే ఆన్‌లైన్‌లో సెల్ల‌ర్ అయి బిజినెస్ చేయ‌డం చాలా ఈజీ.. 5 స్టెప్స్‌లో అది చూడండి.
స్టెప్1. ఆన్‌లైన్‌లో అమ్మ‌డానికి రిజిస్ట‌ర్ చేసుకోండి.
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఈబే.. ఇలా ప్ర‌తి ఆన్‌లైన్ సెల్ల‌ర్‌కీ ఓ డెడికేటెడ్ వెబ్‌సైట్ ఉంటుంది.  మీరు కూడా ఆన్‌లైన్ సెల్ల‌ర్ కావాలంటే బిజినెస్ ఈమెయిల్ ఐడీ, జీఎస్టీఎన్‌లాంటి డాక్యుమెంట్లు ర‌డీ చేసుకోవాలి. అమెజాన్ మీలాంటి సెల్ల‌ర్స్ కోసం స్టార్టింగ్ సెల్లింగ్ గైడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిగ‌తా కంపెనీలు కూడా దీనికి ప్రొఫార్మాతో సిద్ధంగా ఉన్నాయి.  అలా మిమ్మ‌ల్ని మీరు సెల్ల‌ర్‌గా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
స్టెప్ 2. మీ ప్రొడ‌క్ట్స్‌ను క్యాట‌లాగ్ చేయండి.
ఆన్‌లైన్‌లో క‌స్ట‌మ‌ర్ మీ ప్రొడ‌క్ట్ చూసి కొన‌డానికి వీలుగా ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ తయారుచేసుకోండి. మీ ద‌గ్గ‌రున్న మొత్తం ప్రొడ‌క్ట్స్‌ను ఒక్కొక్క‌దాన్ని విడివిడిగా మూడు, నాలుగు యాంగిల్స్‌లో (మ‌నం ఆన్‌లైన్‌లో చూసే ప్రొడ‌క్ట్ ఎలా క‌నిపిస్తుందో అలా) ఫొటోలు తీసి క్యాట‌లాగ్‌కు యాడ్ చేయండి.
స్టెప్ 3.  మీ షిప్పింగ్ ఆప్ష‌న్‌ను పిక్ చేసుకోండి 
మీ ప్రొడ‌క్ట్‌ను కొనుగోలుదారుడికి చేరేవ‌ర‌కు బోల్డ‌న్ని ద‌శ‌ల‌ను దాటుకుని వెళుతుంది. ఆర్డ‌ర్ తీసుకున్నాక వేర్‌హౌస్ నుంచి తీసుకెళ్ల‌డం, ప్యాకింగ్‌, అక్క‌డి నుంచి షిప్పింగ్‌, త‌ర్వాత క‌స్ట‌మ‌ర్‌కు హ్యాండోవ‌ర్ చేయ‌డం. ఇలా చేయ‌డానికి మీ స‌ర‌కును ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లేదా మీరు టై అప్ చేసుకున్న ఈకామ‌ర్స్ సంస్థ తీసుకెళ్ల‌డానికి లేదా మీరు అమ్ముకోవ‌డానికి వీలుగా మీ షిప్పింగ్ ఆప్ష‌న్ పిక్ చేసుకోండి.
స్టెప్ 4. మీ బ్యాంక్ అకౌంట్‌నుపేమెంట్స్‌కు లింక్ చేయండి 
ఆన్‌లైన్‌లో మీరు ప్రొడ‌క్ట్ అమ్మితే కొనుక్కున్న‌వారు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించేస్తారు. క్రెడిట్ కార్డ్‌, డెబిట్‌కార్డ్‌, వాలెట్స్ ఇలా ఏదో ఒక రూపంలో మ‌నీ పే చేస్తారు. మీరు పేమెంట్స్‌కు మీ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేస్తే ఆ అమౌంట్ ఆటోమేటిగ్గా మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.  క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చినా కూడా వారం రోజుల్లోగా అమౌంట్ మీ అకౌంట్‌లో పడిపోతుంది. 
స్టెప్ 5. స్మార్ట్‌ఫోన్ యాప్ కూడా సిద్ధం చేసుకోండి
మీ ఆన్‌లైన్ బిజినెస్ మ‌రింత క‌న్వినెంట్‌గా ఉండాలంటే మీ బిజినెస్‌కు ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌ను కూడా రెడీ చేసుకోండి. అప్పుడు మీకు క‌స్ట‌మ‌ర్ల రీచ్ భారీగా పెరుగుతుంది.  బాగా ఫేమ‌స్ అవుతారు కూడా. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి దిగ్గ‌జాలే త‌మ వెబ్ సైట్ కంటే యాప్ ద్వారానే ఎక్కువ బిజినెస్ జ‌రుగుతోంద‌ని అంగీక‌రించాయి. అందుకే అవి వెబ్‌కంటే యాప్ ద్వారా కొన్న‌వాళ్ల‌కే ఎక్కువ ఆఫ‌ర్లు కూడా ఇస్తాయి.

జన రంజకమైన వార్తలు