• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించ‌డానికి మరో టాప్ 5 యాప్స్ మీకోసం..

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ ప్లే స్టోర్‌లో వేల కొద్దీ యాప్స్ ఉన్నాయి. కానీ అందులో అన్నీ జెన్యూన్ కావు. ఆన్‌లైన్ మీద‌ ఎర్నింగ్ కోసం ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో గ‌తంలో ఓ ఐదు యాప్స్ గురించి చెప్పాం. ఇప్పుడు అలాంటివే మ‌రో 5 బెస్ట్ యాప్స్ వివ‌రాలు మీ కోసం..  
1.టోలునా  (Toluna)  
స‌ర్వేలు, ఒపీనియ‌న్ పోల్స్‌లో పాల్గొన‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించుకోగ‌లిగే యాప్ ఇది.  ప్లే స్టోర్లో ఫ్రీగా దొరికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే కంపెనీలు  త‌మ‌బ్రాండ్ల గురించి, స‌ర్వీస్‌ల గురించి నిర్వ‌హించే స‌ర్వేలు, ఒపీనియ‌న్ పోల్స్ లో పాల్గొన‌వ‌చ్చు.  మీకు వ‌చ్చిన పాయింట్ల‌ను పేపాల్ ద్వారాగానీ, ఈ-కామ‌ర్స్ సైట్ల లో గానీ రిడీమ్ చేసుకోవ‌చ్చు. దీంతోపాటు షాపింగ్‌, హాలీడే ఆప్ష‌న్ల గురించి మంచి స‌జెష‌న్స్ కూడా టోలునా ప్రొవైడ్ చేస్తుంది. టొలునా కమ్యూనిటీలో దాదాపు 40 ల‌క్షల మంది మెంబ‌ర్లున్నారు.  
2. పాక్ట్  (Pact)
ప్లే స్టోర్‌లో ఫిట్‌నెస్‌, హెల్త్ యాప్‌లు వంద‌ల‌కొద్దీ ఉంటాయి. కానీ వాటిలో ఈ పాక్ట్ యాప్ డిఫ‌రెంట్‌. మీరు మీ రెగ్యుల‌ర్ ఎక్స‌ర్‌సైజ్ గోల్స్ రీచ్ అయితే మీకు మ‌నీ ఇస్తుంది. అదే మీరు ఫెయిల‌యితే మీ పాక్ట్ అకౌంట్‌లో పాయింట్ల‌ను గోల్స్ రీచ్ అయిన వేరేవాళ్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసేస్తుంది. మొత్తంగా హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్‌ను ఇలా డిఫ‌రెంట్‌గా ప్ర‌జంట్ చేస్తుందీ యాప్‌.  
3. మింట్ కాయిన్స్  (MintCoins)  
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట‌ర్ చేసుకున్నాక మింట్ కాయిన్స్ ఎకౌంట్‌లోకి లాగిన్ కావాలి. ఫ్రీ గేమ్స్ ఆడ‌టం, వీడియో యాడ్స్ చూడ‌డం, పెయిడ్ యాప్స్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం, స‌ర్వేలు కంప్లీట్ చేయ‌డం, ఫ్రీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డం లాంటి టాస్క్‌లుంటాయి. అయితే వీటివ‌ల్లే మీకు మ‌నీ రాదు. ఇది మీరు మీ ఫ్రెండ్‌కు రిఫ‌ర్ చేసి వాళ్లు దీనిలో జాయిన్ అయితే మీకు 0.25 డాల‌ర్స్ వ‌స్తాయి. జాయిన్ అయిన ఫ్రెండ్‌కు కూడా 0.10 డాల‌ర్స్ ఇస్తారు.  
4. ఇబోట్టా (Ibotta)
డిస్కౌంట్ కూప‌న్స్‌, వోచ‌ర్ కోడ్స్‌, గిఫ్ట్ కార్డ్‌ల‌కు మంచి ఆల్ట‌ర్నేటివ్ ఈ యాప్‌.  Cosco, Target, Walmart, Express, Best Buy, Aero లాంటి గ్రాస‌రీ స్టోర్స్‌లో ఆన్‌లైన్‌లో మీరు కొనే ప్రొడ‌క్ట్‌ల‌మీద ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్స్  ఇబోట్టా యాప్ ప్రొవైడ్ చేస్తుంఇ. పేపాల్ లేదా వెన్మోద్వారా పే చేయాల్సి ఉంటుంది.  iTunes, Amazon.com, Best Buy, Starbucksల్లో కూడా ఈ క్యాష్‌బ్యాక్‌ను రిడీమ్ చేసుకోవ‌చ్చు.  
5. గూగుల్ ఒపీనియ‌న్ రివార్డ్స్  (Google Opinion Rewards)
ఈ యాప్‌ను గూగుల్ క‌న్స్యూమ‌ర్స్ స‌ర్వే క్రియేట్ చేసింది. ప్లే స్టోర్ నుంచి దీన్ని డైన్‌లోడ్ చేసుకుని మీ ప్రొఫైల్‌ను ఎంట‌ర్ చేయాలి. ఇప్పుడు యాప్ మీకు కొన్ని స‌ర్వేలు ఇస్తుంది. మీ ఇంట‌రెస్ట్‌ల మీద ఆధార‌ప‌డి ఈ స‌ర్వేలుంటాయి. స‌ర్వేలు కంప్లీట్ చేస్తే సెంట్ల నుంచి 1,2 డాల‌ర్ల వ‌ర‌కు ఎర్న్ చేయోచ్చు. వీటితో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో మూవీస్‌, బుక్స్‌, యాప్స్‌, మ్యూజిక్ వంటివి కొనుక్కోవ‌చ్చు.  
 

జన రంజకమైన వార్తలు