• తాజా వార్తలు

కూతురి ఫేవ‌రెట్ రైమ్స్‌ను మిలియ‌న్ డాల‌ర్స్ బిజినెస్‌గా మార్చుకున్న భార‌తీయుడు






కూతుర్ని లాలించ‌డం కోసం త‌న‌కొచ్చిన లాలిపాట‌లు పాడిన వినోత్ చంద‌ర్ అనే ఓ వ్య‌క్తి త‌న బిడ్డ‌లాగే పిల్ల‌లంద‌రూ రైమ్స్ అంటే ఇష్ట‌డ‌ప‌తారు క‌దా అని ఆలోచించాడు. అంతేకాదు దాన్ని యానిమేటెడ్ వీడియోస్ త‌యారుచేసి యూట్యూబ్‌లో పెట్టాడు. అది హిట్ట‌వ‌డంతో ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు.  ఇప్పుడ‌ది కోట్ల రూపాయ‌ల వ్యాపారంగా మారింది.  
వినోత్ చంద‌ర్ తండ్రి చంద్ర‌బోస్ త‌మిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ్యూజిక్ కంపోజ‌ర్‌.  1980, 1990ల టైమ్‌లో ర‌జ‌నీకాంత్ సినిమాల‌తోపాటు 250 సినిమాల‌కు మ్యూజిక్ కంపోజ్ చేశారు.  అయితే వినోత్‌కు ఆ సైడ్ పెద్ద ఇంట్ర‌స్ట్ లేదు. అయితే 2011లో కూతురు హ‌ర్షిత  పుట్టిన త‌ర్వాత ఆమెను నిద్ర‌పుచ్చేందుకు  లాలిపాటలు పాడేవాడు.  త‌ర్వాత హ‌ర్షిత యూట్యూబ్‌లో రైమ్స్ చూడ‌డానికి బాగా ఇంట్ర‌స్ట్ చూపించేంది. దీంతో కంప్యూట‌ర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన‌ వినోత్ ఆ త‌ర్వాత  న‌ర్స‌రీ రైమ్స్ కోసం యానిమేటెడ్‌, డ్యాన్సింగ్ వీడియోలు క్రియేట్ చేశాడు.   అలా  2013లో  Chubby cheek రైమ్‌కు క్రియేట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో పెడితే  అది వైర‌ల్ అయింది. 2 వారాల్లోనే 3ల‌క్ష‌ల మంది చూశారు.   కిడ్స్‌, టాడ్ల‌ర్స్ కంటెంట్‌కు ఆన్‌లైన్‌లో మంచి మార్కెట్ ఉంద‌ని , ఇది మంచి బిజినెస్ అవుతుంద‌ని చంద‌ర్ గ్ర‌హించారు. అలా 2013 ఫిబ్రవరిలో త‌న కూతురి నిక్‌నేమ్ చూచూ పేరుతో చూచూ టీవీ (ChuChu TV)ని ఎస్టాబ్లిష్ చేశారు. 
చూచూటీవీలో ఏముంటాయి? 
Twinkle twinkle little star వీడియోతో యూ ట్యూబ్లో ఈ ఛాన‌ల్ కు 5వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరిగారు.  త‌ర్వాత యూ ట్యూబ్‌లో 7 ఛాన‌ల్స్ ప్రారంభించారు. వీటిలో ఒరిజిన‌ల్స్ రైమ్స్‌తోపాటు  వాటి  యానిమేటెడ్ వీడియోస్ ను అప్‌లోడ్ చేస్తున్నారు.   
* ఇలా రోజురోజుకీ డెవ‌ల‌ప‌యి ChuChu TV Nursery Rhymes and Kids Songs ఛాన‌ల్ యూ ట్యూబ్‌లో ఇండియాలోనే సెకండ్‌ ప్లేస్ సాధించింది. 
కోట్లలో ఆదాయం
ChuChu TVకి యూట్యూబ్‌లో కోటీ 50 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లున్నారు. స‌బ్‌స్క్రైబ‌ర్ల లిస్ట్‌లో  ఇండియాలో దీనిది మూడో ప్లేస్‌.  
*  ప్రపంచవ్యాప్తంగా చూస్తే ChuChu TV Nursery Rhymes and Kids songs మోస్ట్ వాచ్‌డ్ ఛానల్స్‌లో 21వ స్థానంలో నిలిచింది.  
యూఎస్‌, కెన‌డా, ఫిలిప్పీన్స్‌, వియ‌త్నాంల్లో వీటికి ఎక్కువ వ్యూయ‌ర్స్ ఉన్నారు.  
* కోట్లాది మంది వ్యూయ‌ర్స్ ఉండ‌డంతో యాడ్ రెవెన్యూ బాగుంది.  యూట్యూబ్ త‌మ రెవెన్యూలో 55% ను కంటెంట్ క్రియేట‌ర్‌కు ఇస్తుంది. ఇండియాలో వెయ్యి వ్యూస్ వ‌స్తే క్రియేట‌ర్‌కు 100 నుంచి 180 రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుంది. అదే యూఎస్‌, యూర‌ప్‌లో అయితే 250 నుంచి 500 రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుంది.  చూచూటీవీ ఏడాదికి 35 నుంచి 50 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయం వ‌స్తోంది.  దీన్ని మ‌రింత పెంచుకోవ‌డానికి తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ వంటి రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌తోపాటు మ‌రికొన్ని దేశాల్లోనూ ఛాన‌ల్స్ న‌డ‌పాల‌ని చూచూటీవీ యోచిస్తోంది.  

జన రంజకమైన వార్తలు