• తాజా వార్తలు
  •  

గూగుల్ సర్వేల‌కు ఆన్స‌ర్ చేసి డ‌బ్బులు సంపాదించొచ్చు తెలుసా? 

గూగుల్.. డేటాలో ఓ స‌ముద్రం. అందుకే  ఏ చిన్న విష‌యం గురించి తెలుసుకోవాల‌న్నా  జ‌నం జై గూగుల్ త‌ల్లీ అంటున్నారు. అంతేకాదు గూగుల్లో చిన్న చిన్న స‌ర్వేల‌కు ఆన్స‌ర్లు చెప్పి మీరు డ‌బ్బులు కూడా సంపాదించొచ్చు.  

ఎలాంటి ప్ర‌శ్న‌లు ఉంటాయి?

 Google Opinion Rewards appను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో కూడా దొరుకుతుంది.  ఫ‌స్ట్ టైం మీరు ఈ యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడు డెమోగ్రాఫిక్ డిటెయిల్స్ (పేరు, అడ్ర‌స్, పిన్ నెంబ‌ర్ వంటివి) అడుగుతుంది.  ఇవి ఎంట‌ర్ చేశాక మీకు సర్వే ప్రారంభ‌మ‌వుతుంది. OK, got it అనే ఆప్ష‌న్‌ను టాప్ చేస్తే స‌ర్వే ప్రారంభ‌మ‌వుతుంది. ఈ స‌ర్వేల్లో అడిగే ప్ర‌శ్న‌ల‌న్నీ ఇంచుమించుగా మీ షాపింగ్ హ్యాబిట్‌ల‌ను బేస్ చేసుకునే ఉంటాయి. మీరు ఈ వారంలో షాపింగ్ చేశారా? ఫ‌్యామిలితో క‌లిసి వెళ‌తారా? ఒక్క‌రే వెళ‌తారా?  ఎలాంటి ఐట‌మ్స్ కొంటారు?  పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది?  కార్డా క్యాషా ఇలాంటి  ప్ర‌శ్న‌లే ఎక్కువ ఉంటాయి.  ఇలా స‌ర్వే ద్వారాక‌లెక్ట్ చేసిన ఇన్ఫ‌ర్మేష‌న్ ను స‌ర్వే సంస్థ‌లు పెద్ద పెద్ద సంస్థ‌ల‌కు అమ్ముకుంటాయి. కన్స్యూమ‌ర్ ట్రెండ్ క‌నుక్కోవ‌డానికి కంపెనీల‌కు ఈ ఇన్ఫో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఈ మ‌నీని ఎలా వాడుకోవాలి? 
స‌ర్వేలో మీరు చెప్పే ఆన్స‌ర్ల‌ను బ‌ట్టి సెంట్ల రూపంప‌లో మ‌నీ యాడ్ అవుతుంది. ఇవి కొన్ని క‌లిశాక డాల‌ర్ అవుతాయి.   ఎక్కువ‌గా గూగుల్ ప్లే క్రెడిట్ లేదా పేపాల్ మ‌నీ రూపంలో వ‌స్తాయి. వీటిని మామూలు డ‌బ్బులా  వాడుకోలేం.  అయితే వీటితో యాప్స్ కొనుక్కోవ‌చ్చు.  లేదంటే ఆన్‌లైన్ మూవీ రెంట‌ల్స్ క‌ట్టుకోవ‌చ్చు.  .పోక్ బాల్స్‌, కామిక్ బుక్స్ కూడా కొనుక్కోవ‌చ్చు.  

 
 

జన రంజకమైన వార్తలు