• తాజా వార్తలు
  •  

నిరుద్యోగుల‌కు ప‌ర్స‌న‌లైజ్డ్ మెంటార్‌ను అందిస్తున్న లింక్డ్ ఇన్ 

జాబ్ కోసం వెతుకున్న వాళ్లు ఎవ‌రైనా ఎక్కువ‌గా ఉప‌యోగించేది లింక్డ్ ఇన్ సైట్‌నే. మ‌న రెజ్యుమెను అప్‌డేట్ చేస్తే చాలు మ‌న ఫ్రొఫైల్‌కు సంబంధించిన అన్ని ఉద్యోగాల వివ‌రాల‌ను ఇది అందిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు నోటిఫికేష‌న్లు పంపుతుంది. లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్ ఉంటే ఎంప్లాయ‌ర్ల‌కు కూడా  త‌మ‌కు కావాల్సిన ఫ్రొఫైల్ ఉన్న‌వాళ్ల‌ను వెత‌క‌డం చాలా సుల‌భం. అయితే ఇన్ని సేవ‌లు అందిస్తున్న లింక్డ్ ఇన్ మ‌రో కొత్త ఆప్ష‌న్‌తో ముందుకొచ్చింది. నిరుద్యోగుల‌కు ప‌ర్స‌లైజ్డ్ మెంటార్‌ను కూడా ఈ సంస్థ అందిచనుంది.

ఇదెలా ప‌ని చేస్తుంది?
లింక్డ్ ఇన్ మ‌న‌కు కొంత‌మంది మెంటార్ల జాబితాను అందిస్తుంది. వారి నుంచి మీ ఫ్రొఫైల్‌కు సూట్ అయ్యే వాళ్ల‌ను మీరే వెతుక్కోవాలి.  త‌మ విద్యార్హ‌త‌లు, అనుభ‌వాన్ని బ‌ట్టి ఎవ‌రైతే మ‌న‌కు మ్యాచ్ అవుతారో వారి వివ‌రాలు అన్ని లింక్డ్ ఇన్‌లో ఉంటాయి.  ఈ మెంటార్లు మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటూ, స‌ల‌హాలు, సూచ‌న‌లు అందజేస్తారు. అలాగే మెంటార్ల‌కు కూడా ఆప్ష‌న్లు ఉంటాయి. మంచి ఫ్రొఫైల్‌ను ఎంచుకుని వాళ్లే ముందుకొచ్చి మెంటార్‌గా ఉండొచ్చు. 500 మిలియ‌న్ల యూజ‌ర్ బేస్ ఉన్న లింక్డ్ ఇన్‌కు ఈ కొత్త ప‌ద్ధ‌తి క‌చ్చితంగా ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని  నిపుణులు అంటున్నారు. ఒక‌సారి , కుదిరిన త‌ర్వాత ఇది సుదీర్ఘ కాలం కొన‌సాగుతుంది. త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఇది అమల్లోకి రానుంది.

లింక్డ్ ఇన్ కు ఉప‌యోగం ఏంటి?
నిరుద్యోగుల‌కు ఇలా మెంటార్ వ్య‌వ‌స్థ‌ను క‌ల్పించడం వ‌ల్ల లింక్డ్ ఇన్ సంస్థ‌కు వ‌చ్చే ఉప‌యోగం ఏమిటి? ఉప‌యోగాలు లెక్క‌లు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. లింక్డ్ ఇన్ త‌న బేస్‌ను మ‌రింత పెంచుకోవాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంది. భార‌త్‌లో లాంటి పొట‌న్షియ‌ల్ ఎక్క‌వ‌గా ఉన్న దేశాల్లో పాతుకుపోవాలంటే క‌చ్చితంగా ఇలాంటి ఆఫ‌ర్లు ఉండాలి. నిరుద్యోగుల‌కు ఉప‌యోగ‌ప‌డాలి.   ఇది ఫ్రీ సర్వీస్ కావ‌డంతో చాలా మంది ముందుకొస్తారు.  దీని ద్వారా లాభం పొందిన వాళ్లు మిగిలిన వాళ్ల‌కు కూడా రిఫ‌ర్ చేస్తారు.  అయితే అంద‌రికి అంద‌రూ సూట్ అయ్యేవాళ్లు... ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌ధ్య‌లోనే కాంటాక్ట్ బ్రేక్ కావొచ్చు... ఇలాంటి ఆరంభ ఇబ్బందుల్ని లింక్డ్ ఇన్ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి.
 

జన రంజకమైన వార్తలు