• తాజా వార్తలు

అమెరికానే కాదు ఇత‌ర దేశాలు కూడా మ‌న ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌ను అడ్డుకుంటున్నాయ్‌!

అమెరికా వెళ్లాలి.. అక్క‌డ జాబ్ చేయాలి...ఇది ఒక‌ప్పుడు మ‌న సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్ క‌ల‌. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడ‌య్యాక ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. వీసా నిబంధ‌న‌ల్ని క‌ఠిన త‌రం చేయ‌డంతో ఇప్పుడు ఎవ‌రు ప‌డితే వాళ్లు అమెరికా వెళ్లే అవ‌కాశం లేకుండాపోయింది. ఇదివ‌ర‌క‌టిలా అమెరికా వెళ్లి జాబ్ ట్ర‌య‌ల్స్ వేసుకుని వ‌చ్చేద్దాం అనే ప‌రిస్థితి కూడా లేదు. ఇప్ప‌టికే అక్క‌డ కొన్నేళ్లుగా జాబ్ చేస్తున్న భార‌త ఉద్యోగులు వీసా గ‌డువు తీరిపోతే ఏంటా అనే ఆందోళ‌న‌లో కూడా ఉన్నారు. అయితే అమెరికా మాత్ర‌మే కాదు వేరే దేశాలు కూడా ఇప్పుడు భార‌త ప్రొఫెష‌న‌ల్స్‌ను త‌మ దేశంలోకి రానీయ‌కుండా నిరోధిస్తున్నాయి...

ఆస్ట్రేలియా, కెన‌డా కూడా..
అమెరికా మాత్ర‌మే కాదు ఆస్ట్రేలియా, కెన‌డా లాంటి దేశాలు కూడా భార‌త ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ మీద క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి.  లోక‌ల్ అథారిటీస్‌తో ప‌ని చేయించుకోవ‌డం కూడా ఇప్పుడు భార‌త ఐటీ ఫ్రొఫెష‌న‌ల్స్‌కు క‌ష్ట‌మైపోతుంది.  ఈ విష‌యంపై ఇప్ప‌టికే నాస్కామ్ ప్ర‌భుత్వానికి ఒక నివేదిక‌ను కూడా అంద‌జేసింది. వ‌ర‌ల్డ్ ట్రేడ్ ఆర్గ‌నైజేష‌న్‌తో కుదుర్చుకున్నఅగ్రిమెంట్‌కు ఇది పూర్తి విరుద్ధ‌మ‌ని భార‌త్ వాదిస్తోంది. అన్ని నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వీసాల‌ను జారీ చేశామ‌ని ఇప్పుడు మ‌ళ్లీ కొత్త నిబంధ‌న‌లు పెడితే ఎలాగ‌ని అంటోంది.  ట్రేడ్ ఫెసిలిటేష‌న్ సర్వీసుల కోసం ప‌ర్మినెంట్ అగ్రిమెంట్ కావాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆస్ట్రేలియా, కెన‌డాతో పాటు న్యూజిలాండ్‌, చైనాల్లో ఉన్న భార‌త ఉద్యోగులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌కు వీసా నిబంధ‌లిలా ఉన్నాయి..

చైనా:..సింగిల్ ఎంట్రీ, త‌క్కువ కాల వ్య‌వ‌ధి గ‌ల వీసాలు ఉన్నాయి.

ఇండోనేషియా:.. 15 రోజులు వ‌ర్క్ ప‌ర్మిట్ మాత్ర‌మే

ఫిలిఫ్పీన్స్‌:. మూడు నెల‌ల కాలానికి మినిమ‌మ్ బ్యాంకు బ్యాలెన్స్ రూ.1.5 ల‌క్ష‌లు ఉండాలి

జ‌పాన్‌:.. ఒరిజిన‌ల్ ఇన్వైట్ అడుగుతున్నారు. దాంతో పాటు ఇన్వైట్ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ కావాలి.
 

జన రంజకమైన వార్తలు