• తాజా వార్తలు

డోర్ టు డోర్ ఫోన్ రిపేర్ స‌ర్వీస్ చేస్తున్న స్టార్ట్ అప్

ఫోన్ రిపేర్ అయితే సాధార‌ణంగా ఏం చేస్తాం? . . వెంట‌నే స‌ర్వీస్ సెంట‌ర్‌కు ప‌రుగెడ‌తాం. లేక‌పోతే ద‌గ్గ‌ర్లో ఉన్న ఏ రిపేర్ సెంట‌ర్‌కో వెళ‌తాం. అయితే రిపేర్ సెంట‌ర్‌కు వెళ్లినా.. స‌ర్వీసు సెంట‌ర్‌కు వెళ్లినా ఫోన్ మ‌న చేతికి వ‌చ్చేస‌రికే చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి ఇది వారాలు కూడా ప‌ట్టొచ్చు. ఇది యూజ‌ర్ల‌కు చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి.  అంతేకాదు మోసాలు  జ‌రిగే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు తొల‌గించ‌డానికి ఒక అంకుర సంస్థ‌కు కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. అదే డోర్ టు డోర్ స‌ర్వీస్‌.

ముంబ‌యి బేస్డ్‌గా
ముంబ‌యి బేస్డ్‌గా మొద‌లైన ఎస్ఎస్‌పీ అడ్వాంటేజ్ స్టార్ట‌ప్ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. 2012లో లాంచ్ అయిన ఈ సంస్థ నెమ్మ‌ది నెమ్మ‌దిగా గుర్తింపు సంపాదించుకుంది. దీని ప్ర‌ధాన ల‌క్ష్యం చెడిపోయిన ఫోన్ల‌ను బాగు చేయ‌డం. అది కూడా ఇంటింటికి వెళ్లి!! ఈ కాన్సెప్ట్ జ‌నాల‌కు కూడా కొత్త‌గా అనిపించి ఒక్కొక్క‌రుగా ఈ స్టార్ట‌ప్ మీద దృష్టి సారించారు. ప్ర‌ఫుల్‌, విల్‌బెర్ట్ రాజ్ అనే  ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి ఈ కాన్సెప్ట్‌ను రూపొందించారు. కొద్దిమంది ఉద్యోగుల‌తో ఆరంభ‌మైన ఈ సంస్థ‌లో ఇప్పుడు 200 మంది ప‌ని చేస్తున్నారంటేనే ఎస్ఎస్‌పీ జోరును అర్థం చేసుకోవ‌చ్చు. త‌క్కువ పెట్టుబ‌డితో మొద‌లైన ఈ అంకుర సంస్థ ఈ ఒక్క ఏడాదిలోనే 1.79 మిలియ‌న్ డాల‌ర్లు రైజ్ చేసిందంటే దీని వేగాన్ని ఊహించొచ్చు. 

రూ.249 చెల్లిస్తే చాలు..
మ‌న‌కు సాధార‌ణంగా ఫోన్ పాడైతే క‌చ్చితంగా 500 రూపాయిలు దాకా ఖ‌ర్చు అవుతుంది. స్క్రీన్ అని సాఫ్ట్‌వేర్ లోప‌మ‌ని ఇలా ఏవేవో కారణాలు చెప్పి స‌ర్వీసు సెంట‌ర్లు డ‌బ్బులు లాగుతాయి. కానీ ఎస్ఎస్‌పీ అడ్వాంటేజ్‌ మాత్రం చాలా మినిమం ఖ‌ర్చుతోనే మీ ఫోన్‌ను రిపేర్ చేసి పెడుతుంది. ఏమైనా పార్ట్‌లు పోయిన‌ప్పుడు త‌ప్ప మిగిలిన చిన్న చిన్న రిపేర్ల‌న్నిటికి రూ.249 చెల్లిస్తే చాలు. ఇది ఒక ఫిక్స‌డ్ రేట్‌గా పెట్ట‌కుంది ఈ సంస్థ‌. శాంసంగ్, హెచ్‌టీసీ, మైక్రోమాక్స్ లాంటి కంపెనీల ఫోన్లు త‌మ‌కు ఎక్కువ‌గా రిపేర్‌కు వ‌స్తున్నాయ‌ని ఆ సంస్థ తెలిపింది.

ఆన్‌లైన్ ద్వారానే..
ఆన్‌లైన్ ద్వారానే కంప్లైంట్ ఇస్తే చాలు ఎస్ఎస్‌పీ మెకానిక్స్ మీ ఇంటికే వ‌చ్చి ఫోన్ చూడ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే వాటిని తీసుకెళ్లి త‌క్కువ స‌మ‌యంలోనే బాగు చేసి మ‌ళ్లీ తీసుకొచ్చి ఇస్తారు. దీనికి ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  త‌మ ఫోన్‌కు ఫ‌లానా ప్రాబ్ల‌మ్ ఉందని కంప్లైంట్‌లో మెన్ష‌న్ చేస్తే చాలు. మిగిలిన ప‌నంతా ఎస్ఎస్‌పీ స‌భ్యులే చూసుకుంటారు.  ఈ కొత్త కాన్సెప్ట్ స‌క్సెస్ కావ‌డంతో దేశంలోని మ‌రికొన్ని న‌గ‌రాలకు త‌మ సేవ‌లు విస్త‌రించాల‌ని ఎస్ఎస్‌పీ ప్ర‌యత్నిస్తోంది.

జన రంజకమైన వార్తలు