• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించ‌డానికి టాప్ 5 ఆండ్రాయిడ్ యాప్స్ మీ కోసం.. 

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి కూడా బోల్డ‌న్ని మార్గాలున్నాయి.  వెబ్‌సైట్లే కాదు గూగుల్ ప్లే స్టోర్‌లో దొరికే యాప్స్‌తో కూడా డబ్బులు సంపాదించుకోవ‌చ్చు. అలాంటి వాటిలో టాప్ 5 ఫ్రీ యాప్స్ వివ‌రాలు మీ కోసం. 
1. వ‌ఫ్ రివార్డ్స్ (Whaff Rewards)  
ఆన్‌లైన్ రివార్డ్స్ యాప్‌ల్లో ఇది టాప్‌.  ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయ‌గానే  కొన్ని సెంట్స్ వస్తాయి.  మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో లాగిన్ అయి రివార్డ్ బేస్డ్ టాస్క్‌లు కంప్లీట్ చేయాలి.  ఇందుకు మీకు రివార్డ్స్ పాయింట్లు ఇస్తారు.  వీటి విలువ 10 డాల‌ర్ల‌కు చేర‌గానే దాన్ని మీ పే పాల్ అకౌంట్ ద్వారా రిడీమ్ చేసుకోవ‌చ్చు.  అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌బాక్స్‌, ప్లే స్టేష‌న్‌, స్టీమ్‌, గూగుల్ ప్లే స్టోర్‌ల్లో  కూడా వీటిని రిడీమ్ చేసుకోవ‌చ్చు. 
2.   ఈఎస్‌పీఎన్ స్ట్రీక్ ఫ‌ర్ ది క్యాష్ ESPN Streak for the Cash
మీకు స్పోర్ట్స్ అంటే పిచ్చా?  ఆటను బాగా ఎన‌లైజ్ చేయ‌గ‌ల‌రా?  విన్న‌ర్ ఎవ‌రో ప్రెడిక్ట్ చేయ‌గ‌ల‌రా? అయితే  మీలాంటి వారికి రివార్డ్స్ కూడా ఇచ్చే యాప్ ఇది. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి సైన్ ఇన్ కావాలి. ఈ యాప్ ఏటా 1.2 మిలియ‌న్ డాల‌ర్స్ ( ఏడున్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు పైగా) క్యాష్ ప్రైజ్‌లిస్తుంది.  ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్‌, బేస్‌బాల్ లాంటి గేమ్స్ చూస్తూ విన్న‌ర్స్ ఎవ‌రో ప్రెడిక్ట్ చేయాలి. ఎక్కువ మ్యాచ్‌లు క‌రెక్ట్‌గా ప్రెడిక్ట్ చేసిన‌వారు లీడ‌ర్ బోర్డ్‌లో ముందుంటారు.   లీడ‌ర్ బోర్డ్‌లో ర్యాంక్‌ను బ‌ట్టి క్యాష్ ప్రైజ్ ఇస్తుంది.  
3. యాప్ ట్రైల‌ర్స్  (App Trailers)  
ప్లే స్టోర్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ కేట‌గిరీలో వ‌చ్చే ఈ యాప్‌తో కూడా డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.  కొత్త‌గా త‌యారుచేసే యాప్స్‌కు సంబంధించిన ట్రైల‌ర్స్ వీడియోలు చూస్తే డ‌బ్బులు వ‌స్తాయి. యాప్ డెమో వెర్ష‌న్ ట్రై చేస్తే ఎక్కువ పాయింట్స్ వ‌స్తాయి. వీట‌ని పే పాల్ క్యాష్ లేదా అమెజాన్ లాంటి సైట్ల‌లో అయినా రిడీమ్ చేసుకోవ‌చ్చు.  
4. స్కూప్ షాట్ (Scoopshot)  
ఫొటోలు, వీడియోలు తీయ‌డం బాగా స‌రదా అయిన వారికిడ‌బ్బులు కూడా సంపాదించుకునే అవ‌కాశం ఇచ్చే యాప్ స్కూప్ షాట్‌.  కొత్త‌గా మీ ఏరియాలో జ‌రుగుత‌న్న ఈవెంట్‌, చుట్టుప‌క్క‌ల సంఘ‌ట‌న‌ల గురించి  మీరు  తీసిన ఫొటోలు, వీడియోలు అప‌లోడ్ చేస్తే స్కూప్‌షాట్ వాటికి ఓ ప్రైస్ ఫిక్స్ చేస్తుంది.  దాన్ని ఎవ‌రైనా కొంటే మీకు మ‌నీ వ‌స్తుంది.   డెయిలీ ఫొటో కంటెస్ట్‌ల్లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు పొంద‌వ‌చ్చు. దీంతో మీకు ఫొటోగ్రాఫ‌ర్‌గా రిప్యుటేష‌న్ కూడా వ‌స్తుంది. 
5. విజిల్‌ (Viggle)  
టీవీ షోలు చూడ‌డం, మ్యూజిక్ విన‌డం మీ హాబీ అయితే మీకు కూడా మ‌నీ సంపాదించే యాప్ విజిల్‌.   ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే  టీవీషోలు, సాంగ్స్ చూసి పాయింట్స్ సంపాదించుకోవ‌చ్చు. అంతేకాదు వీటిమీద‌ రియ‌ల్ టైం క్విజ్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయి.  ఈ పాయింట్ల‌ను అఫీషియ‌ల్ వెబ్‌సైట్ Viggle.comలో మ్యూజిక్‌, మూవీస్‌, ఈ బుక్స్‌, ఆడియో బుక్స్, గిఫ్ట్ కార్డ్స్ కొని రీడీమ్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు