• తాజా వార్తలు
  •  

డిమాండ్‌లో ఉన్న టెకీ జాబ్స్.. వాటి శాల‌రీలు ఇవే

సాఫ్ట్‌వేర్ జాబ్‌.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఫుల్ డిమాండే. బీటెక్‌లు యేవ‌త‌కు మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ పెద్ద క‌ల‌. దీన్ని నెర‌వేర్చుకోవ‌డానికి వాళ్లు ప‌డే ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలో నిల‌క‌డ లేక‌పోయినా.. ఒక‌ప్ప‌టిలా భారీ జాబ్స్ ఆఫ‌రింగ్ లేక‌పోయినా ఈ ఉద్యోగాల‌కు ఉండే గ్లామ‌ర్ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌ట్లేదు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. వాటి శాల‌రీల  గురించి తెలుసుకుందామా!
డేటా ఎన‌లిస్ట్‌
సాఫ్ట్‌వేర్‌లో టాప్ ప్ర‌యారిటీలో ఉన్న జాబ్ ఇదే.  పెద్ద పెద్ద కంపెనీలు స‌మ‌ర్థులైన డేటా అన‌లిస్టుల కోసం నిరంత‌రం అన్వేషిస్తూనే ఉంటాయి. సెర్చ్ ఇంజ‌న్లు, సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌, పైనాల్సియ‌ల్ ఇనిస్టిట్యూష‌న్లు, ఈకామ‌ర్స్‌, హెల్త్‌కేర్‌, ఇంజ‌నీరింగ్ కంపెనీలు, రిటైల్ ఎన‌లైటిక్స్‌, మొబైల్ ఎన‌లైటిక్స్‌, మార్కెటింగ్ ఏజెన్సీలు, డేటా సైన్స్ వెండ‌ర్స్‌కు డేటా ఎన‌లిస్ట్ చాలా అవ‌స‌రం. అన‌లైటిక్స్‌లో అడ్వాన్స‌డ్ స్కిల్ సెట్స్ క‌లిగి ఉండే డేటా ఎన‌లిస్టుల‌కు భారీ డిమాండ్ ఉంది. కంపెనీల డేటాను స‌క్ర‌మంగా ఆర్గ‌నైజ్ చేయ‌డానికి, వాటికి ఒక రూపం క‌ల్పించ‌డానికి వీరి అవ‌స‌రం చాలా చాలా ఉంది.

శాల‌రీ: ఏడాదికి  రూ.6.2 ల‌క్ష‌లు

ఏఐఎంఎల్ డెవ‌లప‌ర్
ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డెవ‌ల‌ప‌ర్ (ఏఐఎంఎల్ డెవ‌ల‌ప‌ర్‌) ఉద్యోగాలు కూడా సాఫ్ట్‌వేర్‌లో చాలా ముఖ్యం. టెక్నాల‌జీ కంపెనీలు, ప్రొడెక్ష‌న్ మ‌రియు మాన్యుఫాక్చ‌రింగ్ కంపెనీలు, హెల్త్‌కేర్‌, ట్రాన్స్‌ఫోర్టేష‌న్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌, ఫైనాన్స్‌, క‌న్‌స్ట్ర్ర‌క్ష‌న్ రంగాల్లో వీరి అవ‌స‌రం చాలా ఉంది. ప్ర‌తి ఫీల్డ్‌లో అప్లిక‌బిలిటీ కోసం డెవ‌ల‌ప‌ర్‌ను ఉప‌యోగిస్తారు. కంపెనీకి సంబంధించిన ఎకో సిస్ట‌మ్‌ను అర్థం చేసుకుని దానికి త‌గ్గ‌ట్టుగా డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల మాన్ ప‌వ‌ర్ ఇబ్బందుల నుంచి కూడా బ‌య‌ట‌ప‌డొచ్చు.

శాల‌రీ: ఏడాది రూ.12 ల‌క్ష‌లు

3డీ డిజైన‌ర్లు
సాఫ్ట్‌వేర్ రంగంలో మ‌రో డిమాండ్ ఉన్న జాబ్ 3డీ డిజైనర్‌. ఏరోస్పేస్‌, యానిమేష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఆటోమోటివ్‌, కంజుమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, కంజుమ‌ర్ గూడ్స్‌, డిఫెన్స్‌, డెంసిటీ, ఎడ్యుకేష‌న్‌, ఇండ‌స్ట్రీయ‌ల్ మిష‌న‌రీ, మాన్యుఫాక్చ‌రింగ్ లాంటి రంగాల్లో 3డీ డిజైన‌ర్ చాలా అవ‌స‌రం. హైలెవ‌ల్ క్రియేటివిటీ కోసం వీరిని ఉప‌యోగించుకుంటారు. త‌మ ప్రొడెక్టుల‌ను వినియోగ‌దారులు పరిచ‌యం చేయ‌డానికి 3డీ డిజైన‌ర్లు ముఖ్యం. 

శాల‌రీ: ఏడాదికి రూ.3.1 ల‌క్ష‌లు

యుఐ, యుఎక్స్ డిజైన‌ర్‌
టెక్నాల‌జీ, ఎంట‌ర్‌ప్రైజ్, హెల్త్‌కేర్‌, ఆటోమోటివ్‌, ఇండ‌స్ట్రీయ‌ల్‌, ఇంజ‌నీరింగ్‌, ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీల్లో యుఐ, యుఎక్స్ డిజైన‌ర్ల రిక్వైర్‌మెంట్ ఉంటుంది. క‌స్ట‌మ‌ర్ల ఇబ్బందుల‌ను అర్థం చేసుకోని దానికి త‌గ్గ‌ట్టుగా కంపెనీ సాఫ్ట్‌వేర్లో మార్పు చేర్పులు చేయ‌డం, సోల్యుష‌న్ డిజైజ‌నింగ్ లాంటి ప‌నులు చేస్తారు.

శాల‌రీ: ఏడాదికి రూ.6.89 ల‌క్ష‌లు

బ్లోక్‌చైన్ ఫైనాన్సియ‌ల్ డీఏవీ
ఇండ‌స్ట్రీ, టెక్నాల‌జీ కంపెనీ, కంజుమ‌ర్ ప్రొడ‌క్ట్స్‌, మాన్యుఫాక్చ‌రింగ్‌, టెక్నాల‌జీ, మీడియా, టెలిక‌మ్యునికేష‌న్స్‌, హెల్త్‌కేర్‌, లైఫ్ సైన్సెస్ రంగాల్లో బ్లోక్ చైన్ డీఏవీ నిపుణుల్ని ఉప‌యోగిస్తారు. టెంప‌ర్ ప్రూఫ్ సిస్ట‌మ్ కోసం వీరు అవ‌స‌రం.  వీరితో పాటు క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్ (ఏడాది రూ.6.9 ల‌క్ష‌లు), క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్ (ఏడాదికి రూ.13.51ల‌క్ష‌లు)

బ్లోక్ చైన్ డీఏవీ శాల‌రీ: ఏడాదికి రూ. 3.9 ల‌క్ష‌లు


 

జన రంజకమైన వార్తలు