• తాజా వార్తలు
  •  

ఫుల్ గిరాకీ.. యాప్ డిజైనింగ్


సగటు భారతీయుడు రోజుకు 169 నిమిషాలపాటు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని తాజా సర్వేలు చెబుతున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌లో సర్ఫింగ్‌ కావొచ్చు, ఎంచక్కా గేమ్స్‌ ఆడుకోవటం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ , బ్యాంక్‌ లావాదేవీలు, ఈమెయిల్స్‌, చాట్‌, బ్రౌజింగ్‌ చేయటం.. లాంటివి చేయటంవల్లే ఇంత సమయం ఖర్చవుతోంది. ఇలా స్మార్ట్‌ఫోన్‌లో ఏమి చేయాలన్నా యాప్‌ ఉండాల్సిందే. అందుకే యాప్‌ డిజైనింగ్‌ ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్న కెరీర్ గా మారిపోయింది.
ఏదైనా యాప్ యాప్ హుర్రే

సోషల్‌ నెట్‌వర్కింగ్‌, గేమింగ్‌, టూరిజం సేవలు, బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్స్‌.. ఇలా స్మార్ట్‌ఫోన్‌లో ఏమి చేయాలన్నా యాప్స్‌ ఉండాల్సిందే. ఐదేళ్ల కితం జావాగేమ్స్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ గురించి ఆలోచించేవారు. ఆ సమయంలో డెస్క్‌టా్‌పపై ఎక్కువ ఫోకస్‌ ఉండేది. స్మార్ట్‌ఫోన్‌ విప్లవం రావటంతో యాప్స్‌ రాజ్యమేలుతున్నాయి. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐస్టోర్‌, విండోస్ స్టోర్‌లోని లక్షల యాప్స్‌ చూస్తుంటే ‘కాదేదీ యాప్స్‌కు అనర్హం’ అనిపిస్తుంది. కాబట్టే యాప్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా మారింది.
సెలబ్రిటీ యాప్స్
ఈ మధ్యకాలంలో ‘స్టార్‌ యాప్స్‌’ ఎక్కువగా వస్తున్నాయి. సినిమా స్టార్స్‌, స్పోర్ట్‌స్టార్స్‌, సెలబ్రిటీలే కాకుండా ఇతరవ్యక్తులు కూడా యాప్‌తో తమను తాము మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. యాప్‌ కావాలనుకునే వారు ఫలానా విషయాలు అందులో ఉండాలని ముందే చెబుతారు కాబట్టి చెప్పిన విషయాన్ని యాప్‌లో సులువుగా పొందుపరచటమే తరువాయి. సునిశిత పరిశీలన, ఆసక్తి, లేటెస్ట్‌ ట్రెండ్‌ను తెల్సుకునే ఉత్సుకత ఉంటే చాలు యాప్‌ డిజైనింగ్‌ను సులువుగా నేర్చుకోవచ్చు.
అవకాశాలు పుష్కలం
యాప్‌డిజైనింగ్‌ నేర్చుకున్న వారికి అవకాశాలూ పుష్కలంగా ఉంటాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్‌, స్టార్టప్‌ కంపెనీలు.. ఇలా పలుచోట్ల యాప్‌ డిజైనర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటాయి. ఫ్రీలాన్స్‌గా కూడా యాప్స్‌ తయారు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. యాప్‌డిజైనింగ్‌ను ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకోవచ్చు. టెక్నాలజీపై అవగాహన ఉండి ఆసక్తి ఉన్నవారు యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌లో కూడా యాప్‌ డిజైనింగ్‌ను నేర్చుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు