• తాజా వార్తలు
  •  

దొంగ‌ల ముఠా.. ఫేస్‌బుక్‌తో ఠా

అన్నింట్లోనూ టెక్నాల‌జీ ముద్రే క‌నిపిస్తోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష్ల‌ను, ఆన్లైన్ షాపింగ్‌లు, యుటిలిటీ యాప్‌లు.. ఇలా అన్నింట్లోనూ నేనున్నానంటోంది. మ‌న పోలీసులు, భ‌ద్ర‌తాద‌ళాలు మ‌రో అడుగు ముందుకేసి నేర ప‌రిశోధ‌న‌లో, దొంగ‌ల్ని, తీవ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవ‌డంలో టెక్నాల‌జీని ట్రాప్‌గా వాడి స‌క్సెస్ అయిపోతున్నారు. తాజాగా ఫేస్‌బుక్ సాయంతో ఓ క‌ర‌డుగట్టిన దొంగ‌ల ముఠాను ప‌ట్టేశారు మ‌న హైద‌రాబాద్ పోలీసులు. త‌ట్లూ (న‌కిలీ బంగారు ఇటుక‌ల‌) బాజీ ముఠా పేరిట జ‌నాన్ని మాయ చేసి డ‌బ్బులు దోచుకునే ఓ ముఠా ఆచూకీని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల ఆధారంగా అరెస్ట్ చేసి క‌ట‌క‌ట‌ల్లోకి నెట్టారు.
దొరికిన‌కాడికి దోచేస్తారు
తట్లూ బాజీ ముఠా కొంత‌మందిని ఐడెంటిఫై చేసుకుంటుంది. వారిని ఎవ‌రూ లేని చోటికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి డ‌బ్బులు, న‌గ‌దు దోచుకుంటారు. ఈ గ్యాంగ్‌లో 100 మందికి పైగా స‌భ్యులుంటారు. వీరికి అర్ష‌ద్ లీడ‌ర్‌. రాజస్థాన్‌, యూపీ, హ‌ర్యానా రాష్ట్రాల బోర్డ‌ర్‌లో ఉండే దేవసరస్ అనే విలేజ్‌లో 90% దొంగల కుటుంబాలే. తట్లూ(నకిలీ బంగారు ఇటుకలు) పేరుతో వీరు ఢిల్లీ, హ‌ర్యానా, యూపీల్లోని ప‌ట్ట‌ణాల‌కు వెళ్లి మా పొలాలు తవ్వుతుంటే బంగారు ఇటుకలు బయటకొచ్చాయంటూ మాయమాటలు చెప్పి నకిలీ బంగారం ఇటుకలు అంటగట్టి డ‌బ్బులు దోచుకుంటారు. ఆ ఒక్క ఊళ్లోనే ఇలాంటి యాభై గ్యాంగ్‌లు ఉంటాయి. వీటిలో కింగ్‌పిన్ అర్షద్‌ అలియాస్‌ రాహుల్‌వర్మ. ఈ గ్యాంగ్‌లు ఇటీవ‌ల రూట్ మార్చాయి. సీసీ కెమెరాలు కావాల‌ని కంపెనీలు, డీల‌ర్ల‌ను వాళ్ల ఏరియాకు పిలిపించి గ‌న్‌తో బెదిరించి డ‌బ్బులు కొట్టేస్తున్నారు.
టెక్నాల‌జీతో వ‌లేశారు
తట్లూబాజీ దొంగల ముఠాను పట్టుకునేందుకు డీసీపీ అవినాశ్‌ మొహంతీ ఆరునెలల క్రితం ఒక స్పెష‌ల్ టీంను ఏర్పాటు చేశారు. ఓ దొంగ‌ను ప‌ట్టుకుని ఎంక్వ‌యిరీ చేశారు. అత‌ను చెప్పిన డిటెయిల్స్ ఆధారంగా వారంద‌రూ కాస్ట్లీ సెల్‌ఫోన్లు వాడుతున్నార‌ని ఐడెంటిఫై చేసుకున్నారు. వారికి ఫేస్‌బుక్‌ ఖాతాలుంటాయని స‌స్పెక్ట్ చేశారు. దొంగ‌ల పేర్లు, మారుపేర్ల ఆధారంగా ముఠా నాయకుడు అర్షద్‌ను గుర్తించారు. ఫేస్‌బుక్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో పోస్టింగ్‌ల ఆధారంగా ఎక్కడున్నారు? ఎక్కడి వెళ్తున్నారని ఫాలో అయ్యారు. హైద‌రాబాద్ రామంతాపూర్‌లోని సిరిటెక్నాలజీ ఎండీ డి.అంజయ్య తమను తట్లూబాజీ గ్యాంగ్ దోచుకుంద‌ని ముషీరాబాద్‌ పోలీస్ స్టేష‌న్‌లో కంప్ల‌యింట్ ఇచ్చారు. ఇలాగే సిటీలో ప‌లు కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. ఇన్ఫోమాటిక్‌ సంస్థ యజమాని త‌నకు యూపీ నుంచి సీసీ కెమెరాలు కావాలంటూ ఫోన్‌ వచ్చిందని చెప్పగా.. వెంటనే ఫోర్స్‌ను పంపి రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా పరిసర ప్రాంతాలకు రప్పించారు. గ్యాంగ్‌లీడ‌ర్ అర్షద్‌ సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు