• తాజా వార్తలు
  •  

ఫ్రీ వైఫై హాట్ స్పాట్లలో హైదరాబాద్ టాప్    

    
    హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైఫై సేవలను మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. డిజిటల్ తెలంగాణ విజన్లో భాగంగా నగరంలోని జనభా అధికంగా ఉన్న 1,000 ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్లు  అందుబాటులోకి తెచ్చారు. వీటిని 3 వేల ప్రాంతాలకు విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


    కాగా సిటీలో ఎక్కడెక్కడ హాట్ స్పాట్లు ఉన్నాయనే వివరాలను జీహెచ్ఎంసీ, ఐటీశాఖ వెబ్ సైట్లలో ఉంచారు. అన్నీ అందుబాటులోకి వస్తే 3 వేల ఉచిత హాట్ స్పాట్లతో దేశంలోనే మొదటి పూర్తి వైఫై సిటీగా హైదరాబాద్ నిలువబోతోంది. ప్రస్తుతానికి 5-10 ఎంబీపీఎస్ వేగంతో 30 నిమిషాలపాటు ఉచితంగా వైఫై అందిస్తున్నారు. తర్వాత నామామాత్రపు చార్జీలు విధిస్తారు. పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేష న్లు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో హాట్ స్పాట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో పలు సెల్యులార్, ఇతర కంపెనీలు భాగస్వాములయ్యాయి. 


    మొదటి దశలో రెండేండ్ల కిందట ప్రయోగాత్మకంగా 100 చోట్ల హాట్ స్పాట్లు  అందుబాటులోకి తెచ్చారు. అది విజయవంతం కావడంతో ఆ సంఖ్యను వెయ్యికి చేశారు. ఆగస్టు నాటికి 3 వేల ప్రాంతాలకు విస్తరించాలన్నది ప్రణాళిక.  అంతేకాదు... ఇది అనుకున్నది అనుకున్నట్లు పూర్తయితే తరువాత దశలో తెలంగాణలో ఇతర ప్రధాన నగరాలైన కరీంనగర్, వరంగల్, ఖమ్మంల్లోనూ విస్తారంగా వైఫై హాట్ స్పాట్లు ఏర్పాటు చేస్తారట.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు