• తాజా వార్తలు

హైదరాబాద్ లో పాఠశాల స్థాయి నుండే ఈ-చదువులు

నేటి మన విద్యా వ్యవస్థ లో పుస్తకాలు లేని చదువును మనం ఊహించ  గలమా? కాని అది సాద్యమే నంటుంది  మైక్రొ సాఫ్ట్ సంస్థ.సాంకేతిక  పరిజ్ణానం  సహకారంతో విద్యాభ్యాసాన్ని డిజిటల్ దిశగా తీసుకు వెళ్ళే లక్ష్యం తో మైక్రొ సాఫ్ట్ ఇండియా క్లౌడ్ ఆధారిత  సేవలను ప్రారంభించింది.  ఈ సేవలను అందించడానికి ముందుగా హైదరాబాదు కు చెందిన శ్రీ  చైతన్య స్కూల్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం లో భాగంగా మొదటి దశలో హైదరాబాద్ మరియు బెంగళూరు ల లో ని 80 శ్రీ  చైతన్య పాఠశాలలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సేవలు అందుబాటు లోనికి వస్తారు. సబ్జెక్ట్  పరిజ్ణానాన్ని శ్రీచైతన్య   అందిస్తే క్లౌడ్ సేవల ద్వార దాన్ని విద్యార్థులకు మైక్రొ సాఫ్ట్  అందిస్తుంది. ఈ సేవలను వినియోగించుకొవటానికి అవసరమైన టాబ్లెట్ కంప్యూటర్ ల ను కూడా మైక్రొ సాఫ్ట్ అందిస్తుంది. మొదటి దశలో సుమారు  14000 టాబ్లెట్ లను సంస్థ అందిస్తుంది.దీనిని ప్రయోగాత్మకంగా 3,4,5 తరగతులలో  ప్రవేశ పెడతారు .ఈ తరగతుల విద్యార్థులు ఎటువంటి పుస్తకాలూ తెచ్చుకోవలసిన అవసరం లేదనీ కేవలం టాబ్లెట్  లను తెచ్చుకుంటే  సరిపోతుందనీ శ్రీ చైతన్య విద్యా సంస్థల దైరెక్టర్ వీరమాచనేని శ్రీ  చరణ్  చెప్పారు.

వచ్చె ఏడాదిన్నర కాలంలో దేశ వ్యాప్తంగా 1500 పాఠశాలలకు  ఎడ్యు   క్లౌడ్ ద్వారా క్లౌడ్ ఆధారిత  సేవలను అందుబాటులోనికి తీసుకురావాలని మైక్రొసాఫ్ట్  సంస్థ భావిస్తుంది. దీని వలన 60 లక్షల మంది విద్యార్థు 10 లక్షల మంది ఉపాధ్యాయులు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా బోధన అభ్యాసనను పొందుతారని కంపెనీ  వెల్లడించింది. అన్నీ  అనుకున్నట్లు జరిగితే మనం ఇకనుండీ పుస్తకాలు లేని చదువులను చూడబొతున్నాము అన్నమాట.

జన రంజకమైన వార్తలు