• తాజా వార్తలు
  •  

ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ నేడే

తెలంగాణలోని ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు కాసేప‌ట్లో విడుద‌ల‌వుతాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ రిజల్ట్స్ ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి వీటిని రిలీజ్ చేస్తారు. ఆ త‌ర్వాత నుంచి ఆన్‌లైన్‌లో.. బోర్డు సెల‌క్ట్ చేసిన వెబ్‌సైట్ల‌లో రిజ‌ల్ట్స్ చెక్ చేసుకోవ‌చ్చు. స్టేట్ వైడ్‌గా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ను 9ల‌క్షల 76 వేల మంది రాశారు. దస‌రా నుంచి ఏర్ప‌డిన కొత్త జిల్లాల ప్ర‌కార‌మే రిజ‌ల్ట్స్ రిలీజ్ చేస్తామ‌ని ఇంటర్ బోర్డు ప్ర‌క‌టించింద‌. సోమ‌వారం విడుదల చేయాలని నిర్ణయించినా ఆ రోజు డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండ‌రు. దీంతో ఆదివార‌మే అంటే ఒక‌రోజు ముందే విడుదల చేస్తున్నారు.
రిజ‌ల్ట్స్ కోసం చూడాల్సిన వెబ్‌సైట్లు
bietelangana.cgg.gov.in
tsbie.cgg.gov.in
bie.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ప్ర‌ధాన ప‌త్రిక‌ల వెబ్‌సైట్ల ద్వారా కూడా రిజ‌ల్ట్స్ తెలుసుకునే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు