• తాజా వార్తలు
  •  

తెలంగాణ బడ్జెట్లో ఐటీకి ఎంతిచ్చారు..

 తెలంగాణ బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఐటీ శాఖకు రూ.252.89 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటికే అమలు చేస్తున్న పలు ఐటీ సంబంధింత పాలసీలకు ఇది ఉపయోగపడనుంది.
 తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఇండస్ర్టీని ప్రోత్సహించడానికి ఐసీటీ పాలసీని.. ఎలక్ర్టానిక్స్ పాలసీని.. యానిమేషన్-గేమింగ్ పరిశ్రమకు అనుకూలంగా ఇమేజి పాలసీ.. ఇన్నోవేషన్ పాలసీ.. రూరల్ టెక్నాలజీ పాలసీ.. డాటా సెంటర్స్ పాలసీ.. ఓపెన్ డాటా పాలసీ.. సైబర్ సెక్యూరిటీ పాలసీ వంటివన్నీ రూపొందించి అమలు చేస్తున్నారు.
 ఐటీరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలు సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ యూనిట్లు నెలకొల్పుతున్నాయి. అంతేకాదు.. ఐటీ ఎగుమతుల్తో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఐటీ ఎగుమతుల విషయంలో తెలంగాణ వాటా 12 శాతం. గత ఏడాది ఏకంగా రూ.75,070 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి. అంతేకాదు.. తెలంగాణలో ఐటీ కంపెనీల వల్ల సుమారు 4 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి.
 వ్యాపార విధానం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యయం తక్కువ, కాస్మోపాలిటన్ కల్చర్, టాస్క్, టీహబ్ వంటి సంస్థల కారణంగా.. దేశంలోనే హైదరాబాద్ అత్యుత్తమ చిరునామాగా మారిందని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదికలోనూ ఇక్కడి ఐటీ ప్రగతికి సంబంధించిన గణాంకాలను గతంలో విడుదల చేశారు.  దాని ప్రకారం ఐటీ మరియు ఐటీఈఎస్ ఎగుమతుల్లో తెలంగాణ సుమారు 13.26 శాతం వ్రుద్ధి రేటు సాధించింది. అదే జాతీయ స్థాయిలో చూస్తే ఇది కేవలం 12.3 శాతమే.2015-16లో హైదరాబాద్లో దాదాపు 35,611 సాఫ్ట్ వేర్ నిపుణులకు ఉద్యోగావకాశాల్ని కల్పించింది. దీంతో, తెలంగాణ ఐటీ రంగంలో సుమారు రూ.4,07,385 మంది పని చేస్తున్నట్లు సమాచారం. ఐటీ శాఖ  తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జి (టాస్క్)ని ఏర్పాటుచేసుకున్నారు.  దేశీయ పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటాలు కలిసి టీ-హబ్ ను ఆరంభించారు. థాంప్సన్ ఎలక్ట్రానిక్స్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్ వంటివి తెలంగాణలో ప్రప్రథమంగా తమ ఉత్పత్తి కేంద్రాలను ఆరంభించాయి. ఈ రంగంలో ప్రగతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో బడ్జెట్లోనూ దీనికి ప్రాధాన్యమిచ్చినట్లుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు