• తాజా వార్తలు
  •  

టీఎస్ వ్యాలెట్‌తో ట్యాప్ బిల్ పేమెంట్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న ట్యాప్ క‌నెక్ష‌న్లున్న దాదాపు 10 ల‌క్ష‌ల మందికి బిల్ క‌ట్ట‌డం ఇక ఈజీ కాబోతోంది. స్మార్ట్‌ఫోనుంటే.. టీఎస్ వ్యాలెట్ ద్వారా ఉన్న చోటు నుంచే క్ష‌ణాల్లో న‌ల్లా బిల్ క‌ట్టేయొచ్చు. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల కోసం తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ సొంతంగా రూపొందించుకున్న టీఎస్‌-వ్యాలెట్‌ పరిధిలోకి తాజాగా హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ బోర్డును కూడా చేర్చ‌బోతున్నారు. ఇప్పటికే ట్యాప్ క‌నెక్ష‌న్లున్న వారి అడ్ర‌స్‌లు, ఫోన్ నెంబ‌ర్లు వంటి డిటెయిల్స్‌ను టీఎస్‌-వ్యాలెట్‌తో అనుసంధానించామ‌ని అధికారులు చెబుతున్నారు. త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ అఫీషియ‌ల్‌గా ప్రారంభించ‌బోతోంది. ఈ నెలలోనే స‌ర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌య‌త్నిస్తోంది. జీహెచ్ఎంసీలో ట్యాప్ క‌నెక్ష‌న్ల‌కు నెల‌నెలా రీడింగ్ తీసి, బిల్లులు ఇవ్వ‌డానికి వాట‌ర్ బోర్డు సిబ్బందితోపాటు ప్రైవేటు ఏజెన్సీల‌కు కూడా అప్ప‌గించారు. అయితే ట్యాప్ క‌నెక్ష‌న్లున్న వారిలో స‌గం మంది నెల‌నెలా రెగ్యుల‌ర్‌గా బిల్లు క‌ట్ట‌డం లేదు. వాట‌ర్ బోర్డు ఆఫీసుల‌కు, లేదా జీహెచ్ ఎంసీ జోన‌ల్ కార్యాల‌యాల‌కు లేదంటే ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల‌కో వెళ్లేందుకు వీలు చిక్క‌కే ఇందులో చాలా మంది స‌మ‌యానికి బిల్లు క‌ట్ట‌డం లేదు. మొబైల్ వాలెట్‌తో బిల్లు చెల్లించే అవ‌కాశం క‌ల్పిస్తే వీరిలో చాలా మంది రెగ్యుల‌ర్ గా బిల్లు క‌ట్టేస్తార‌ని అంచ‌నా.
ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉండ‌వు.. టీఎస్ వాలెట్‌ను అఫీషియ‌ల్‌గా ప్రారంభించిన త‌ర్వాత ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాట‌ర్‌బోర్డు స‌ర్వీస్‌ల్లోకి వెళ్లి మీ ట్యాప్ క‌నెక్ష‌న్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే మీరు ఎంత బిల్లు క‌ట్టాలో వ‌స్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్‌తో వాలెట్‌లో ముందుగానే క్యాష్ వేసుకుంటే నేరుగా బిల్లు క‌ట్టేయ‌వ‌చ్చు. కొన్ని రకాల ఆన్‌లైన్‌ చెల్లింపులకు బ్యాంకులు స‌ర్వీస్ ఛార్జి వ‌సూలు చేస్తున్నాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో క‌ట్టినా ఎంతో కొంత స‌ర్వీస్ ఛార్జి తీసుకుంటున్నారు. టీఎస్ వ్యాలెట్‌తో క‌డితే ఈ ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉండ‌వు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు