• తాజా వార్తలు
  •  

పైసా ఛార్జీ లేదు.. ఫీచ‌ర్ ఫోన్‌తోనూ ప‌ని చేసే టి-వాలెట్‌

క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ గవ‌ర్న‌మెంట్ టి- వాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ ఐటీశాఖ పరిధిలోని ఎలక్ట్రానిక్స్‌ సేవల విభాగం (ఈసేవ-మీసేవ), ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ సంస్థ కలసి ఈ టి-వాలెట్‌ను రూపొందించాయి. ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ గురువారం దీన్ని లాంచ్ చేశారు. ట్రాన్సాక్ష‌న్ల‌పై ఎలాంటి ఛార్జీ లేక‌పోవ‌డం, ఫీచ‌ర్ ఫోన్ తోనూ, ఆఖ‌రికి ఫోన్ లేకున్నా కూడా వాడుకోగ‌ల‌గ‌డం టీ వాలెట్ స్పెషాలిటీస్‌. మ‌రి దాన్ని ఎలా వాడుకోవాలో చూడండి.
ఎలా వాడుకోవాలంటే..
* గూగుల్‌ప్లే స్టోర్‌లోకి వెళ్లి టివాలెట్‌ తెలంగాణ అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో http://twallet.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. *స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వాలెట్‌ను లోడ్ చేసుకోవ‌చ్చు. * ఫోన్‌లేనివారు లేదా ఫీచర్‌ ఫోన్ ఉన్న‌వాళ్లు మీసేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆధార్‌ నంబర్ లేదా బయోమెట్రిక్‌ ద్వారా ఈ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇలాంటి వారు మీసేవా కేంద్రాల ద్వారా టి-వాలెట్‌లో డబ్బులు వేసుకోవచ్చు. * ఈ-కేవైసీ చేసుకుంటే యూజ‌ర్లు ఈ వాలెట్‌లో లక్ష రూపాయల దాకా ఉంచుకోవచ్చు. ఈ-కేవైసీ లేక‌పోతే నెలకు రూ.20వేలు లిమిట్‌గా నిర్ణ‌యించారు.
టి-వాలెట్ స్పెషాలిటీస్‌
* తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో టీ వ్యాలెట్‌ యాప్ ను డిజైన్ చేశారు. * క‌రెంట్‌, ట్యాప్ బిల్స్‌, ప్రాప‌ర్టీ టాక్స్‌, గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్స్ కోసం దీని నుంచి డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. * ఆర్టీఏ చ‌లానాలు కూడా క‌ట్టొచ్చు . * ఫోన్‌ రీఛార్జీలు, బస్‌టికెట్లు వంటివి కూడా బుక్ చేసుకోవ‌చ్చు. * ఫ్యూచ‌ర్‌లో స్కాల‌ర్‌షిప్‌లు, పెన్ష‌న్లు, ప్ర‌భుత్వం స్్ఆఉపకారవేతనాలు, ఫించన్లు కూడా వీటిద్వారానే ప్రభుత్వం చెల్లిస్తుంది. * ట్రాన్సాక్ష‌న్ల‌కు ఎలాంటి ఛార్జి లేదు. మీ వాలెట్లో ఉన్న అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు కూడా పంపించే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు