• తాజా వార్తలు
  •  

వరంగల్ లో టెలినార్ 4 జి షురూ.....

 

వరంగల్  లో టెలినార్ 4 జి షురూ


ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన టెలి నార్ తెలంగాణా లోని వరంగల్ నగరం లో 4 జి సేవలను అందిచేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ను గత బుధవారం ప్రారంభించింది. రూ 85 రూపాయల నుండీ ప్రారంభం అయ్యే సూపర్ సేవర్ 4 జి ప్లాన్ లను ఈ కంపెనీ ప్రకటించింది. అంతేగాక నెట్ వర్క్ సామర్థ్యం కోసం GSM  టెక్నాలజీ ని కూడా ఉపయోగించుకోనున్నట్లు తన స్పెక్ట్రమ్ ను మరింత విస్తృత పరుచుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది.

టెలి నార్ AP మరియు TS లలో తన పూర్తీ నెట్ వర్క్ ను ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి కంపెనీ చెబుతున్న లెక్కల ప్రకారం దాని సైట్ లలో 64 శాతం ఆధునీకరించ బడ్డాయి. దీనికి సంబందించిన సైట్ లు అన్నీ కొత్త టెక్నాలజీ కి మారడం తో మెరుగైన నెట్ వర్క్ ద్వారా తన వినియోగదారులకు డేటా వినియోగం లో ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని  యోచిస్తుంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ కంటే ముందే కొన్ని విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ లను టెలి నార్ 4 జి పూర్తిచేసింది. వారణాసి లోని 6 సర్కిల్ లలోనూ, వైజాగ్, అమరావతి, ఆగ్రా, ఆనంద్, లక్నో, రాంచి, విజయవాడ, తెనాలి, ఏలూరు, భీమవరం మరియు ధనబాద్ లలో విజయవంతంగా టెలి నార్ 4 జి తన ప్రయోగాన్ని పూర్తిచేసింది.

ఇక డేటా ప్యాక్ ల విషయానికొస్తే హై స్పీడ్ డేటా ప్యాక్ రూ 85  నుండీ రూ 249 ల ధర లో మొత్తం ఏడు రకాల ధరలలో లభిస్తాయి. STV 85 తో 500 MB 4 జి డేటా 21 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తుంది. STV 149 తో 1 GB 4 జి డేటా తో పాటు అన్ని లోకల్ మరియు STD కాల్ లు నిమిషానికి 25 పైసలకే 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తాయి. STV 249 తో 2 GB 4జి డేటా మరియు అన్ని లోకల్ మరియు STD కాల్ లు నిమిషానికి 25 పైసలకే 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తాయి.

టెలి నార్ కొత్త సబ్ స్క్రైబర్ ల కోసం ఈ కంపెనీ ప్రత్యేక టారిఫ్ ఓచర్ ను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం STV 189 తో రూ 40 ల టాక్ టైం, 1GB 4 జి డేటా మరియు అన్ని లోకల్ మరియు STD కాల్ లు నిమిషానికి 25 పైసలకే 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తాయి.

అడ్వాన్స్డ్ పరికరాలు మరియు సమర్థ వంతమైన  స్పెక్ట్రమ్ వినియోగం తో 4 జి వినియోగం లో టెలి నార్ తన గేర్ మార్చినట్లే కనిపిస్తుంది. ధర పరంగా ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న 4 జి సేవలతో పోల్చితే కాస్త మెరుగ్గానే టెలి నార్ ఉంది. మరి వినియోగ దారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు