• తాజా వార్తలు
  •  

ఇంట‌ర్ పాఠాలు .. ఇక డిజిట‌ల్‌లో

ప‌దో త‌ర‌గ‌తి పాసై కాలేజీ మెట్టెక్క‌బోతున్న స్టూడెంట్ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌. ఇక‌పై ఇంట‌ర్ పాఠాలూ కంప్యూట‌ర్ లేదా మొబైల్ ఫోన్ల‌లో చ‌దివేసుకోవ‌చ్చు. అవును నిజ‌మే..  తెలంగాణ ఇంటర్‌ బోర్డు డిజిటల్‌ దిశగా అడుగులు వేస్తోంది.  జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త ఎక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచి డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.  కంప్యూటర్‌ లేదా మొబైల్ లోనూ పాఠాలు చ‌దువుకునేలా  ఓ ఐటీ కంపెనీతో కలిసి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు క‌సరత్తు చేస్తోంది.  రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా డిజిట‌ల్ పాఠాలు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నామ‌ని బోర్డు చెబుతోంది.
 తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే అన్నింటినీ డిజిట‌ల్ దిశ‌గా తీసుకెళుతోంది.  టీహ‌బ్ లాంటి సంస్థ‌ల ఏర్పాటుతో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన తెలంగాణ రాష్ట్రం ఇంట‌ర్ పాఠాల‌నూ డిజిట‌ల్ ఫార్మాట్‌లో అందుబాటులోకి తెచ్చి మ‌రో కొత్త ఒర‌వ‌డి నెల‌కొల్ప‌బోతోంది.  ఇందుకోసం డిజిట‌ల్ స్ట‌డీ కిట్ల‌ను త‌యారుచేయాల‌ని రిప్యూటెడ్ ఈ-లెర్నింగ్ సొల్యూష‌న్ ప్రొడ‌క్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీలను ఆహ్వానించింది. వీటిలో నుంచి ఓ కంపెనీని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.
 ఎలా పొందాలి?
  ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉచితంగా, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు నామమాత్రపు రుసుంతో ఈ డిజిజ‌ల్ కంటెంట్‌ను  పొందవచ్చని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. డిజిటల్‌ విధానానికి అనుగుణంగా మొబైల్‌, కంప్యూటర్లలో ఒకసారి పాఠాన్ని లేదా కంటెంట్‌ను  డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఇంట‌ర్నెట్  లేకున్నా దీన్ని ఆఫ్‌లైన్లో ఉపయోగించకోవచ్చు.  పాఠ్య పుస్తకాలు చదువుకోవడం, వాటిపై వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని చూసి అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు.  ఎంసెట్‌, జేఈఈ పరీక్షలు, నీట్‌, సీఏ-సీపీటీ

"

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు