• తాజా వార్తలు
  •  

పుట్టిన ఇరవై నిమిషాల్లోనే ఆదార్ కార్డు మరియు జనన ధ్రువ పత్రం...

వరికైనా కొత్తగా ఆదార్ కార్డు కావాలంటే ఏం చేస్తారు? vro దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుని దగ్గరలోని అదార్ కేంద్రానికి వెళ్లి అక్కడ బయో మెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేయించుకుని అదార్ ను నమోదు చేస్తారు. ఆ తర్వాత ఒక ఇరవై రోజులకు మనకు ఆదార్ వచ్చినట్లు మెసేజ్ వస్తే రసీదు తీసుకుని మీ సేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే వారు మంకు మన ఆదార్ ను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసి ఇస్తారు. ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ. ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు ఆదార్ కార్డు కావాలంటే పరిస్థతి చెప్పనవసరం లేదు. ఈ ప్రక్రియ మొత్తం తో పాటు పిల్లల జనన ధ్రువ పత్రం ను కూడా సమర్పించవలసి ఉంటుంది. అయితే ఈ ప్రహసనానికి చరమ గీతం పాదాల్ని అనుకుంటుంది తెలంగాణా ప్రభుత్వం.

అప్పుడే పుట్టిన పిల్లలకు పుట్టిన ఇరవై నిమిషాల్లోనే ఆదార్ కార్డు ను మరియు జనన ధ్రువ పత్రాన్నీ ఇవ్వనున్నట్లు తెలంగాణా ఐటి శాఖామంత్రి శ్రీ కే టి ఆర్ తెలిపారు. దీనికోసం తెలంగాణా ప్రభుత్వం మరియు ఆదార్ మధ్య ఒక ఒప్పందం  కూడా కుదిరింది. ఆదార్ నమోదులో జరుగుతన్న జాప్యం మొదలైన కారణాలు దృష్టి లో ఉంచుకొని ఈ  నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తుంది. ఈ  విధానాన్ని మొదటగా ప్రభుత్వ ఆసుపత్రుల లో ప్రవేశ పెట్టి నిదానంగా రాష్ట్రం అంతా ఉన్న మిగతా ప్రైవేట్ మరియు కార్పోరేట్ ఆసుపత్రులలో కూడా అమలు లోనికి తేనున్నారు.

కొన్ని రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కూడా ఇలాగె పుట్టిన వెంటనే ఆదార్ మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఏదేమైనా మన ప్రభుత్వాలు అప్పుడే పుట్టిన  పిల్లలకు కూడా ఆదార్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాయంటే  ఈ పాలన లో మనం మరో అడుగు ముందుకు వేసినట్లే.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు