• తాజా వార్తలు

టాంక్ బండ్ పై వై ఫై

హైదరాబాదు లో ఉచిత  వైఫై సేవలను అందించేందుకు తెలంగాణా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా టాంక్ బండ్ పై వై ఫై సేవలను రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి శ్రీ కెటి ఆర్ ప్రారంభించారు. టాంక్ బండ్ దగ్గరకు సరదాగా వచ్చే  ప్రజల కోసం గంట పాటు ఉచిత వై ఫై సేవలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.అంతేగాక సికింద్రాబాద్  రైల్ వే స్టేషన్ లోనూ ఈ సేవను ఇప్పటికే ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే హైదరాబాద్ లోని మిగతా ప్రదేశాల   లోనూ ఈ సేవలను ప్రారంభిస్తామని ఆయన  చెప్పారు.

విజయవాడ బస్సు స్టాండ్ లో  వైఫై సేవలను ప్రారంభించిన సంగతి మనందరకీ తెలిసిన విషయమే కదా! మన తెలుగు రాష్ట్రాలు ఇలాగే అభివృద్ధి విషయం లోనూ, టెక్నాలజీ విషయం లోనూపోటీ పది మన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాయని ఆశిద్దాం.

 

జన రంజకమైన వార్తలు