• తాజా వార్తలు
  •  

తెలంగాణను వైఫై స్టేట్ చేయనున్న బీఎస్ఎన్ఎల్


పబ్లిక్ సెక్టార్ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తెలంగాణలో 4జి ప్లస్‌ వైఫై వాణిజ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 121 హాట్‌ స్పాట్‌ జోన్లు, 925 యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఎల్ అండ్ టీకి బాధ్యతలు
బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్ప త్రులు, బహిరంగ ప్రదేశాల్లో హాట్‌ స్పాట్‌ జోన్లను ఏర్పాటు చేసే బాధ్యత ఎల్‌అండ్‌టికి అప్పగిస్తున్నారు. కాలపరిమితిని బట్టి పది రూపాయల నుంచి 599 రూపాయల వరకు చెల్లించేలా వోచర్లు అందుబాటులోకి తేనున్నారు. జులై చివరి నాటికి ఈ సేవలు కచ్చితంగా అందుబాటులోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

రైల్ వైఫై తరహాలోనే..
4జీ ప్లస్ పబ్లిక్ హాట్ స్పాట్ జోన్లు అందుబాటులోకి వస్తే పర్యాటకులతో, స్థానికులకూ ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉన్న పబ్లిక్ వైఫై వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతున్నాయి. అదే తరహాలో బస్ స్టాండ్లలో, ఆసుపత్రుల్లో, ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై అందుబాటులోకి వస్తే తెలంగాణ వైఫై స్టేట్ గా మారనుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు