• తాజా వార్తలు
  •  

రిలయన్సు జియోపై హైదరాబాద్ కార్పొరేషన్ కంప్లయింట్

దేశవ్యాప్తంగా 4జీ ఇంటర్నెట్ విప్లవం సృష్టించిన రిలయన్స్ జియోపై హైదరాబాద్ నగరపాలక సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ కంప్లయింట్ వెనుక టెక్నికల్ కారణాలేమీ లేవు. జియో తన నెట్ వర్కు కోసం చేపట్టిని తవ్వకాల వల్ల నగర ప్రజలకు జరిగిన నష్టంపైనే జీహెచ్ ఎంసీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో గురువారం వేకువజామున కురిసిన కుండపోత వర్షంతో పలు మార్గాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు.
ఎల్ అండ్ టీ, జియోలు గతకొంతకాలంగా తవ్వుతున్న గుంతల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు గుర్తించారు. యూసఫ్ గూడలో గుంతలు తవ్వ వదిలేశారంటూ జూబ్లిహిల్స్ పీఎస్ లో తమ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని అనవసరంగా డ్యామేజ్ చేశారంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో మెట్రో పిల్లర్ల కోసం ఎల్ అండ్ టీ గుంతలు తీసింది. వారి పనులు పూర్తయినా వాటిని పూడ్చలేదు.
అలాగే జియో కూడా తమ టవర్ల కోసం గుంతలు తవ్వింది. వర్షానికి ఈ గుంతలన్నీ నీరు నిండిపోయాయి. నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అయితే... ఇదంతా జియో, ఎల్ అండ్ టీల వల్లే జరిగిందంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు