• తాజా వార్తలు
  •  

హైదరాబాద్ టెక్కీలకు బేసిక్ కోడ్ కూడా రాయడం రాదట


ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, ముంబయి, చెన్నై, పుణె, హైదరాబాద్ , కోల్ కతాల పేరు చెబితే చాలు ఐటీ హబ్ లు అని అంటారు ఎవరైనా. అయితే.. ఈ నగరాలన్నిటిలోనూ మన హైదరాబాద్ కు చెందిన టెక్కీల స్కిల్సే చాలా తక్కువట. మనవాళ్లు మిగతా నగరాల టెక్కిలతో పోటీ పడలేకపోతున్నారట. ది ఆటోమాటా నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్(ఏఎన్ ఎస్ పీ) సంస్థ తన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడించింది.

హైదరాబాద్ టెక్కిలకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా తక్కువట. ఆ కారణంగానే వారు ఉద్యోగాలు పొందడంలో వెనుకబడిపోతున్నారని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. 500 ఇంజినీరింగ్ కాలేజిల్లోని 36 వేల మంది విద్యార్థులకు స్కిల్ టెస్టు పెట్టిన ఈ సంస్థ అందులో 0.7 శాతం మాత్రమే బేసిక్ కోడ్ రాయగలిగారని చెప్పింది. వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే తప్ప ఎందుకూ పనికిరారని తేల్చేసింది.

అయితే... తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జి వారు కూడా ఈ విషయం అంగీకరిస్తూ ఇక్కడి టెక్ యువతకు నైపుణ్య శిక్షణలు ఇస్తామని చెబుతున్నారు. లేకపోతే మనవాళ్లు వెనకబడిపోవడం ఖాయమట.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు