• తాజా వార్తలు
  •  

కాల్ డ్రాప్‌లందు అండ‌ర్‌గ్రౌండ్ మెట్రోలో కాల్ డ్రాప్స్ వేర‌యా!!! 

నెట్‌వ‌ర్క్ లేక‌పోవ‌డం,  కాల్ చేస్తుంటే మ‌ధ్య‌లో క‌ట్ అయిపోయే కాల్ డ్రాప్స్ బాధ ఇప్పుడు బాగా తగ్గింది. టెలికం నెట్‌వ‌ర్క్‌లన్నీ 4జీకి అప్‌గ్రేడ్ కావ‌డంతో ఈ ప్రాబ్లం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కానీ బెంగ‌ళూరు మెట్రో రైళ్ల‌లో మాత్రం ఈ ప్రాబ్లం కనిపిస్తోంది. ముఖ్యంగా అండ‌ర్ గ్రౌండ్‌లో నుంచి వెళ్లేట‌ప్పుడు  అస‌లు నెట్‌వ‌ర్కే ఉండ‌డం లేద‌ని యూజ‌ర్లు గ‌గ్గోలు పెడుతున్నారు.  బీఎస్ఎన్ఎల్  నుంచి ఎయిర్‌టెల్ వ‌ర‌కు ఏ నెట్‌వ‌ర్క్ కూడా రావ‌డం లేదు. 
 కీల‌క‌మైన రూట్‌
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేష‌న్  (BMRC) న‌మ్మ మెట్రో ఫ‌స్ట్ ఫేజ్ కింద 8.8 కి.మీ. అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో ట్రాక్ నిర్మించింది. చిక్‌పేట్‌, సిటీ రైల్వే స్టేష‌న్‌, క‌బ్బ‌న్ పార్క్‌, కేఆర్ మార్కెట్‌, విధాన సైధ‌, మెజిస్టిక్ స్టేష‌న్లు ఈ స్ట్రెచ్‌లోనే ఉన్నాయి. అయితే ఇది అండ‌ర్ గ్రౌండ్‌లో ఉండ‌డంతో ఇంత దూరం మెట్రో రైల్‌లో సెల్యూల‌ర్ నెట్‌వ‌ర్క్ లేకుండాప్ర‌యాణించాల్సి వ‌స్తోంద‌ని ప్యాసింజ‌ర్లు చెబుతున్నారు.  వాయిస్ కాల్స్‌, డేటా ఏదీ ప‌ని చేయ‌డం లేద‌ని, నాలుగు నెలలుగా ఈ స‌మ‌స్య ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది వాళ్ల కంప్ల‌యింట్‌. ఒక్క‌సారి మెట్రో అండ‌ర్ గ్రౌండ్ రూట్‌లోకి వెళ్లిందంటే మ‌ళ్లీ తిరిగి భూమి మీద‌కు వ‌చ్చేవ‌ర‌కు త‌మ‌కు బ‌య‌టిప్ర‌పంచంతో సంబంధాలు ఉండ‌డం లేద‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న‌గా చెబుతున్నారు.
ప‌రిష్కార‌మేంటి? 
బీఎంఆర్‌సీ అఫీషియ‌ల్ చెప్పే వివ‌రాల ప్ర‌కారం అండ‌ర్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్ల‌లో కూడా మొబైల్ నెట్‌వ‌ర్క్ రావ‌డానికి అవ‌స‌ర‌మైన ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఏర్పాటుకు అమెరిక‌న్ ట‌వ‌ర్ కార్పొరేష‌న్  (ATC)  అనే ప్రైవేట్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను ప్రొవైడ్ చేసింద‌ని, అయితే సెల్యుల‌ర్ కంపెనీలు దాన్ని వాడుకొనేందుకు ఫీజ్ చెల్లించాల‌ని, అందుకు జియో లాంటి కంపెనీలు  ఒప్పుకోవ‌డం లేద‌ని బీఎంఆర్‌సీ చెబుతోంది. ఈ ఫీజు ఎక్కువ‌గా ఉంద‌నఓ మొబైల్ నెట్‌వ‌ర్క్ ప్ర‌తినిధి చెప్పారు. అయినా ఫ్లైట్‌లో వెళ్లిన‌ప్పుడు ఎలా మొబైల్ వాడ‌రో.. ఇక్క‌డ కూడా అలాగే అనుకుంటే కొన్ని నిముషాల్లోనే ప్ర‌యాణికులు గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లిపోతారు క‌దా అని కామెంట్ చేశారు.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు