• తాజా వార్తలు
  •  

జియో స‌ర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌తో బంప‌ర్  బొనాంజా. ఎవ‌రూ చెప్ప‌ని  విష‌యాలివి

భార‌తీయ టెలికం రంగంలో ఎన్నో సంచల‌నాల‌కు తెర‌తీసిన జియో తాజాగా స‌ర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. జ‌న‌వ‌రి 15లోగా 399 అంత‌కంటే ఎక్కువ  మొత్తంతో రీఛార్జి చేయించుకునేవారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.  ఈ స‌ర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌లో జియో క‌స్ట‌మ‌ర్లు క్యాష్‌బ్యాక్ వోచ‌ర్లు, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, ఈకామ‌ర్స్ సైట్ల‌లో కొనుగోళ్ల‌కు వాడుకునేందుకు కూప‌న్లు బోలెడు ఇస్తుంది.  దీంతో ఈ సెక్ష‌న్‌లో త‌న‌తో పోటీప‌డుతున్న మిగిలిన టెలికం ఆప‌రేట‌ర్లంద‌రినీ జియో వెన‌క్కినెట్టేయ‌బోతుంద‌ని మార్కెట్ వ‌ర్గాల విశ్లేష‌ణ‌.  అస‌లు స‌ర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌లో జియో యూజ‌ర్లు ఏమేం పొంద‌బోతున్నారో పూర్తి డిటెయిల్స్ ఇవి..చూద్దాం ప‌దండి. 
క్యాష్‌బ్యాక్ వోచ‌ర్లు
399 లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేయించుకుంటే  400 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ వోచ‌ర్లు వస్తాయి. ఒక్కోటి 50 రూపాయ‌ల విలువైన 8 వోచ‌ర్లుగా వీటిని ఇస్తారు.  వీటిని 399 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకున్న‌ప్పుడు ఒక్కొక్క‌టి చొప్పున వాడుకోవ‌చ్చు. అంటే 50 రూపాయ‌ల డిస్కౌంట్ వ‌స్తుంది. 
ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 
దీంతోపాటు డిజిట‌ల్ వాలెట్ల‌కు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది.   కొత్త యూజ‌ర్ల‌కు అమెజాన్ పేలో 100 రూపాయ‌లు, పేటీఎంలో 50 రూపాయ‌లు, ఫోన్‌పేలో 75 రూపాయ‌లు, యాక్సిస్ పేలో 100 రూపాయ‌లు, ఫ్రీఛార్జిలో 50 రూపాయ‌ల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను జియో ఇవ్వ‌నుంది. దీంతోపాటు 300 రూపాయ‌ల మొబీక్విక్ సూప‌ర్ క్యాష్ కూడా జియో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇస్తుంది.  ఇప్ప‌టికే 399 రూపాయ‌ల రీఛార్జి చేయించుకుని జియో వాడుతున్న‌క‌స్ట‌మ‌ర్ల‌కు  అమెజాన్ పేలో 100 రూపాయ‌లు, పేటీఎం, ఫోన్‌పే, యాక్సిస్ పే,  ఫ్రీఛార్జిల్లో 30 రూపాయ‌ల చొప్పున క్యాష్‌బ్యాక్‌తోపాటు 149 రూపాయ‌ల మొబీక్విక్ సూప‌ర్ క్యాష్ వ‌స్తుంది.
కూప‌న్లు
దీంతోపాటు ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో ఉప‌యోగించుకునే కూప‌న్లు కూడా జియో ఈ స‌ర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ కింద ఇస్తుంది. 399 రూపాయ‌లు అంత‌కంటే ఎక్కువ రీఛార్జి చేయించుకుంటే 2,600 రూపాయ‌ల విలువైన వోచ‌ర్లు వ‌స్తాయి. జూమ్ కార్‌లో 20% డిస్కౌంట్ (మ్యాగ్జిమం 1000 రూపాయ‌లు), వోయో హోట‌ల్ బుకింగ్స్‌లో 30% డిస్కౌంట్‌, ఓయో మ‌నీ క్యాష్‌బ్యాక్‌లో 50% (మ్యాగ్జిమం లిమిట్ 1500) వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.   
* దీంతోపాటు యూజర్స్  పేటీఎం మాల్ యాప్‌లో 10వేల రూపాయ‌ల ఎల‌క్ట్రానిక్ గూడ్స్ కొంటే 2వేల రూపాయ‌ల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. 
*  బిగ్‌బాస్కెట్ యాప్ ద్వారా 600 రూపాయ‌ల ప‌ర్చేజ్ చేస్తే 20% డిస్కౌంట్‌, గ్రోఫ‌ర్స్‌లో 1500 వ‌స్తువుల కొంటే 300 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్  ఇస్తారు.  
* యాత్రా సైట్ ద్వారా రౌండ్ ద ట్రిప్ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే 1000 రూపాయ‌ల డిస్కౌంట్‌, వ‌న్‌వే టికెట్ అయితే 500  రూపాయ‌ల డిస్కౌంట్ ఇస్తారు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు