• తాజా వార్తలు

ఎయిర్ టెల్ సెల్ఫ్ కేర్ పోర్టల్ తో లాభమేంటి?

టెలికాం రంగంలో పోటీని తట్టుకోవడానికి భారతీ ఎయిర్ టెల్ నిత్యం ఏదో ఒక కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ నెక్స్ట్ పేరుతో కొత్త మార్పులకు తెర తీసింది.
    ఇందులో భాగంగా పోస్టు పెయిడ్ నెట్ వర్కులో ఎలాంటి మార్పులు చేసినా అవి వెంటనే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంతకుముందు వీటికి 4 గంటల సమయం పట్టేది. ఇప్పుడు  సెల్ఫ్ కేర్ పోర్టల్ ద్వారా చేంజ్ చేసిన మరు క్షణమే మారిపోతోంది.

సెల్ఫ్ కేర్ పోర్టల్ లో ఉన్నముఖ్యమైన ఫీచర్లివీ..
* అంతకుముందులా కాకుండా ఇప్పుడు యూసేజ్ హిస్టరీని ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇంకా ఎన్ని కాల్స్ ఉన్నాయి. ఎన్ని ఎస్సెమ్మెస్ ఉన్నాయి. ఎంత డాటా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని ప్రకారం వాడుకోవచ్చు.
* వేర్వేరు ఎయిర్ టెల్ అకౌంట్లను ఒక్కచోటే మెంటైన్ చేయొచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టు పెయిడ్ కనెక్షన్లున్నా... బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లున్నా, ప్రీపెయిడ్, డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నా కూడా అవన్నీ ఒకే అకౌంట్ కు లింక్ చేసి చూసుకోవచ్చు.
* అంతకుముందు ప్లాను మార్చుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మనమే మార్చుకోవచ్చు. అయితే.. ఒక బిల్ సైకిల్ లో ఒక సారి మాత్రమే ఇలా మార్చుకునే వీలుంటుంది.
* 4జీ సిమ్ కార్డు కావాలంటే దీని ద్వారా తీసుకోవచ్చు. మన పాత సిమ్ డ్యామేజ్ అయితే కొత్త 4జీ సిమ్ కోసం ఇందులోంచి రిక్వెస్టు పెట్టుకోవచ్చు. అడ్రస్ మనం అక్కడ నమోదు చేస్తే నేరుగా ఇటికే సిమ్ వస్తుంది.
* ఎయిర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ను కూడా ఇక్కడి నుంచే మెంటైన్ చేయొచ్చు. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంటు సహాయంతో రీచార్జిలు, మనీ ట్రాన్సఫర్లు వంటివన్నీ చేసుకోవచ్చు.
 

జన రంజకమైన వార్తలు