• తాజా వార్తలు
  •  

ఆధార్‌, సిమ్ లింకేజి ఇక మీ ఇంటి దగ్గ‌రే.. ప్ర‌భుత్వ నిర్ణయం 

 ఆధార్ , సిమ్ లింకేజి విష‌యంలో హోరెత్తుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌మెంట్ రోజుకో కొత్త యాక్ష‌న్ ప్లాన్‌తో ముందుకొస్తోంది.  సీనియ‌ర్ సిటిజ‌న్లు, డిజేబిలిటీతో వేలిముద్ర‌లు వేయలేనివారికోసం ఓటీపీ బేస్డ్ అథెంటికేష‌న్ చేస్తామ‌ని  ప్ర‌క‌టించింది. ఇప్పుడు లేటెస్ట్‌గా సీనియ‌ర్ సిటిజ‌న్లు,  డిజేబుల్డ్ ప‌ర్స‌న్స్ కోసం డోర్ స్టెప్ వెరిఫికేష‌న్ ప్రాసెస్‌ను అనౌన్స్ చేసింది.   ఆధార్‌, సిమ్ లింకేజికి 2018 మార్చి 31 వ‌ర‌కు టైం ఉంది. అయితే లాస్ట్‌మినిస్ ర‌ష్‌ను త‌గ్గించ‌డానికి కంపెనీలు, గ‌వ‌ర్న‌మెంట్ కూడా ముందు నుంచే మొబైల్ యూజ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి.  
ఏంటీ డోర్‌స్టెప్ స‌ర్వీస్ 
విక‌లాంగులు, వ‌యోవృద్ధులకు ఇంటికే వ‌చ్చి ఆధార్ కార్డ్ వివ‌రాలు తీసుకుని సిమ్ రీ వెరిఫికేష‌న్ చేసేస్తారు. డోర్‌స్టెప్ స‌ర్వీస్ ప్రొవైడ్ చేయ‌మ‌ని వీరు UIDAI అథారిటీస్‌కు రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ ఎలా పంపాలో  UIDAI వెబ్‌సైట్‌లో వివరాలు ఇస్తారు. దీంతోపాటు మిగిలిన ప్ర‌సార మాధ్య‌మాల్లో కూడా ప్ర‌చారం చేస్తారు.  
మ‌రో ఛాయిస్ కూడా
ఆధార్ డేటా బేస్‌లో మొబైల్ నెంబ‌ర్లు ఫీడ‌యి ఉన్న‌వారికి ఓటీపీ పంపి, సిమ్ యూజర్ ఆ ఓటీపీని  ఎంట‌ర్ చేస్తే చాలు వెరిఫికేష‌న్ ప్రాసెస్ పూర్తి చేసేలా గ‌వ‌ర్న‌మెంట్ ఇప్ప‌టికే ప్లాన్ చేస్తోంది. ఆధార్ డేటా బేస్‌లో 50 కోట్ల మొబైల్ నంబ‌ర్ల‌కు దీన్ని వాడుకోవాల‌ని చూస్తోంది. దీనితోపాటు  వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్, సిమ్ కార్డ్ లింకేజ్‌ను చేయ‌డానికి కూడా క‌స‌రత్తు చేస్తున్నారు. దాని గురించి వివ‌రాలు ఇంకా పూర్తిగా తెలియ‌డం లేదు. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు