• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ 4జీ డేటా.. ఇక డ‌బుల్ స్పీడ్‌తో

టారిఫ్ కాస్త ఎక్కువ‌గా ఉన్నా స‌ర్వీస్ విష‌యంలో ఎయిర్‌టెల్‌కు పేరు పెట్ట‌లేం. ఎయిర్‌టెల్ ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్‌వ‌ర్క్ అని బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్‌లో వ‌రల్డ్‌క్లాస్ సంస్థ అయిన ఓక్లా ప్ర‌క‌టించింది. అయితే రిల‌య‌న్స్ జియో వ‌చ్చాక అన్ని కంపెనీలూ నెట్‌వ‌ర్క్ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్నాయి. దీంతో ఏ నెట్‌వ‌ర్క్ అయినా మంచి క‌వ‌రేజ్‌, స‌ర్వీస్ ఇస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఎయిర్‌టెల్ త‌న బెంచ్‌మార్క్ అయిన క్వాలిటీ స‌ర్వీస్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేయ‌డానికి ఏర్పాట్లు చేసింది. ముందుగా ఏపీ, తెలంగాణాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ (డేటా) స‌ర్వీసుల‌ను అప్‌గ్రేడ్ చేసింది. డ్యూయ‌ల్ క్యారియ‌ర్ టెక్నాల‌జీని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నామ‌ని, దీంతో స‌ర్వీస్ క్వాలిటీ దాదాపు డ‌బుల్ అవుతుంద‌ని చెప్పింది.
డ్యూయ‌ల్ క్యారియ‌ర్ టెక్నాల‌జీ అంటే..
అత్యాధునిక ‘డ్యూయల్‌ క్యారియర్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అంటే టీడీ -ఎల్‌టీఈ (2300 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌), ఎఫ్‌డీ -ఎల్ టీఈ (1800 హెర్ట్జ్ బ్యాండ్‌)ల‌ను క‌లిపింది. ఈ డ్యూయ‌ల్ క్యారియ‌ర్ టెక్నాల‌జీ నెట్‌వ‌ర్క్ కెపాసిటీని, స్పెక్ట్ర‌మ్ ఎఫిషియ‌న్సీని బూస్ట‌ప్ చేస్తుంది. తద్వారా ఎక్క‌డైనా ప్రయాణంలో ఉన్నా కూడా వేగంగా, నాణ్యమైన కంటెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ చెప్పింది. మొబైల్ యూజ‌ర్ల సంఖ్య భారీగా పెరుగుతోంద‌ని, ఈ టెక్నాల‌జీ వ‌ల్ల యూజ‌ర్ల సంఖ్య ఎంత పెరిగినా నెట్‌వ‌ర్క్ క్వాలిటీ త‌గ్గ‌కుండా యూజ‌ర్లంద‌రికీ అందుతుంద‌ని చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల్లో 160 పట్టణాల్లో ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తోంది.
వ‌ర‌ల్డ్ క్లాస్ నెట్‌వ‌ర్క్ ఇవ్వాల‌నేది టార్గెట్
మా క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రపంచ స్థాయి నెట్‌వర్క్‌ అనుభవాన్ని ఇవ్వాల‌న్న‌ది ఎయిర్‌టెల్‌ లక్ష్యమని కంపెనీ చెప్పింది. 2015 నవంబరులో ప్రాజెక్ట్‌ లీప్‌ పేరుతో నెట్‌వర్క్ మోడ్ర‌నైజేష‌న్ ప్రోగ్రాంను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. ఇందుకోసం ఇండియాలో దాదాపు 60,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

జన రంజకమైన వార్తలు