• తాజా వార్తలు
  •  

జియోతో పోటీకి ఎయిర్‌టెల్ సై.. క‌స్ట‌మ‌ర్ల‌కు పండ‌గే

ఇండియాలో అత్య‌ధిక మంది క‌స్ట‌మ‌ర్లున్న టెలికం నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ ఎయిర్‌టెల్. జియోవ‌చ్చాక ప్ర‌తి అడుగులోనూ దాంతో పోటీప‌డాల్సి వ‌స్తోంది.  ఫ్రీ కాల్స్‌, భారీ ఆఫ‌ర్స్‌తో తెర‌మీదికి వ‌చ్చిన జియో అత్యంత వేగంగా కోట్ల మంది యూజ‌ర్ల‌ను సంపాదించుకుంది.  టారిఫ్ విష‌యంలో ఎయిర్‌టెల్ కంటే జియో బాగుంది.అందుకే క‌స్ట‌మ‌ర్లు చేజారిపోకుండా అన్ని కంపెనీల‌తోపాటు ఎయిర్‌టెల్ కూడా త‌మ టారిఫ్‌ను, ప్లాన్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రివైజ్ చేసుకుంటోంది. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి 399,149రూపాయ‌ల ప్లాన్స్‌లో జియోతో స‌మాన‌మైన బెనిఫిట్స్ ఇస్తోంది. 
399 ప్లాన్‌కు వాలిడిటీ 84 రోజులు
ఎయిర్‌టెల్‌ తన   399 రూపాయ‌ల టారిఫ్‌ను రివైజ్ చేసింది.  దీని కింద ఇప్ప‌టివ‌ర‌కు రోజు 1జీబీ 3జీ లేదా 4జీ డేటా, అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, నేష‌నల్‌, రోమింగ్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంస్‌ల చొప్పున ఇచ్చేది. ఈ ప్లాన్ వాలిడిటీ   70 రోజులు ఉండేది. ఇప్పుడు దాన్ని 84 రోజులకు  పెంచింది. అంటే 84 రోజుల‌పాటు ఈ సౌక‌ర్యాల‌న్నీ పొంద‌వ‌చ్చు.  జియో 399 రూపాయ‌ల ప్లాన్‌లో కూడా సేమ్ ఇదే సౌక‌ర్యాలు వ‌స్తున్నాయి కాబ‌ట్టి ఈ సెగ్మెంట్‌లో ఎయిర్‌టెల్ జియోతో సై అన్న‌ట్లే.  అయితే జియో రోజుకు 1జీబీ డేటా వాడుకున్నాక అదనపు ఛార్జీలు లేకుండా 64kbps వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. కానీ ఎయిర్‌టెల్‌లో 1జీబీ త‌ర్వాత వాడితే మెయిన్ బ్యాల‌న్స్ నుంచి మ‌నీ క‌ట్ అవుతుంది.   అలాగే ఎయిర్‌టెల్ త‌న 149ప్లాన్‌ను కూడా స‌వ‌రించింద‌. దీంతో ఇప్పుడు 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా,  100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్ ఇస్తుంది. ఇది కూడా జియో 149 ప్లాన్‌తో స‌మాన‌మైన ఆఫ‌ర్. 
జియో ఏం చేస్తుందో?
జియోకు ఉన్న‌క‌స్ట‌మ‌ర్ల‌లో అత్య‌ధిక మంది వాడేది 399 ప్లాన్‌. 84 రోజుల‌పాటు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తుండ‌డంతో అంద‌రూ ఈ ఆఫ‌ర్‌ను వాడుకొంటున్నారు. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఇదేఆఫ‌ర్ ఇస్తుండ‌డంతో జియో మ‌ళ్లీ కొత్త ఆఫ‌ర్ తేవాల్సిన ప‌రిస్థితి  వ‌చ్చింది. ఎందుకంటే ఎయిర్‌టెల్ యూజ‌ర్ బేస్ ఎక్కువ కాబట్టి వాళ్లంతా 399 ప్లాన్ వాడుకుంటే రెవెన్యూప‌రంగా ఎయిర్‌టెల్ మ‌ళ్లీ దూసుకుపోతుంది. కాబట్టి  జియో మ‌ళ్లీ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు కొత్త ఆఫ‌ర్లు ఇస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాల‌ అంచ‌నా.

జన రంజకమైన వార్తలు