• తాజా వార్తలు
  •  

ప్ర‌స్తుతం ఉన్న 4జీ ప్రీ పెయిడ్ ప్లాన్ల‌న్నీ ఒకేచోట మీకోసం..

జియో రాక‌తో ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో మొద‌లైన ప్రైస్‌వార్ ఏడాదిగా కొనసాగుతూనే ఉంది.  కంపెనీలు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గకుండా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. జియోను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌న్న ల‌క్ష్యంతో ఎయిర్‌టెల్ కొత్త కొత్త టారిఫ్‌లు ప్ర‌క‌టిస్తుంటే, మిగ‌తా కంపెనీలు కూడా అదే ప‌నిలో ప‌డ్డాయి. దీంతో మొబైల్ యూజ‌ర్ల‌కు డేటా, కాల్స్ కూడా చౌక‌గా ల‌భిస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్లో  500 రూపాయ‌ల ధ‌ర‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ 4జీ ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఏమిటో తెలుసుకోండి. 
ఎయిర్‌టెల్ 448 ప్లాన్  
448 రూపాయ‌ల‌తో ఈ ప్లాన్ తీసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు  1జీబీ చొ.ప్పున డేటా ఇస్తుంది.  రోజుకు 300, వారానికి 1200 వ‌ర‌కు లోక‌ల్‌, ఎస్టీడీ,  రోమింగ్‌లో  ఫ్రీ కాల్స్ చేసుకోవ‌చ్చు.  దీనితోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. గ‌తంలో 84 రోజులు ఉండే ఈ ప్లాన్‌లో ఇప్పుడు 14 రోజులు త‌గ్గించారు. దాన్ని కాంపెన్సేట్ చేయ‌డానికి రోమింగ్‌లో కూడా ఫ్రీ కాల్స్ చేసుకునే అవ‌కాశం ఎయిర్‌టెల్ క‌ల్పించింది.  కాబ‌ట్టి ఈ ప్లాన్ పిరియడ్‌లో మీరు రోమింగ్‌లోకి వెళ్లినా ఎక్స్‌ట్రా ఛార్జ్ ప‌డ‌దు. 
ఐడియా 357 ప్లాన్  
ఐడియా క‌స్ట‌మ‌ర్లు 358 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే 28రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ల‌భిస్తుంది. రోజూ 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. అయితే వాలిడిటీ పిరియ‌డ్ క‌నీసం నెల కూడా లేక‌పోవ‌డంతో ఇది అంత క్లిక్క‌య్యే అవ‌కాశాల్లేవు. 
జియో 459 ప్లాన్  
కాంపిటీట‌ర్స్‌కు అంద‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న టారిఫ్‌ను మార్చుకుంటూ వెళుతున్న జియో తెచ్చిన కొత్త ప్లాన్ ఇది. 459 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  84 రోజుల పాటు ప‌ని చేస్తుంది. రోజూ 1జీబీ డేటా, లోక‌ల్‌, ఎస్టీడీతోపాటు ఇండియాలో రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  జియో సినిమా, జియో టీవీ, జియో మ్యూజిక్‌లాంటి జియో యాప్స్‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ.   ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆఫ‌ర్ ఇదే.
వొడాఫోన్ 509 ప్లాన్ 
వొడాఫోన్ 509 రూపాయ‌ల ఆఫ‌ర్ జియో ఆఫ‌ర్‌కి కొద్దిగా ద‌గ్గ‌ర‌గా ఉంంది. దీనితో 84 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది.రోజూ 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ.  అయితే ఫ్రీ కాల్స్‌ను రోజుకు 250, వారానికి 1000 నిముషాల‌కు లిమిట్ చేసింది. రోజూ 100 ఎస్ఎంఎస్‌ల‌తోపాటు వొడాఫోన్ యూజ‌ర్ల‌కు వొడాఫోన్ ప్లే స‌ర్వీస్‌కు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తారు.  
బీఎస్ఎన్ఎల్ 429 ప్లాన్  
ఇక ప్ర‌భుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కాంపిటీష‌న్‌లో ఉన్నానంటోంది.  దీని వాలిడిటీ 90రోజులు. రోజూ 1జీబీ డడేటా, అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ.  ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వ్యాలిడిటీ 90 రోజులు ఉన్న ప్లాన్ బీఎస్ఎన్ఎల్‌దే.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు