• తాజా వార్తలు
  •  

ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ అందిస్తున్న వాటిలో బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే  

ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో ఇప్పుడు ప్రైస్‌వార్ పీక్ స్టేజ్‌లో ఉంది. నువ్వు ఒక‌టి ఇస్తే నేను రెండిస్తా అన్న‌ట్లు కంపెనీలు యూజ‌ర్ల మీద ఆఫ‌ర్ల వాన కురిపిస్తున్నాయి.  దేశంలోనే అతి పెద్ద టెలికం నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ ఎయిర్‌టెల్ కూడా ర‌క‌రకాల టారిఫ్‌ల‌తో యూజ‌ర్ల‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ ఇస్తున్న 5 బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవీ..  
1) ఎయిర్‌టెల్ 349 కాంబో ప్లాన్ 
 349 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. వ్యాలిడిటీ 28 రోజులు.  
2)  399 అన్‌లిమిటెడ్ కాంబో ప్లాన్‌
ఇది కూడా 349 ప్లాన్‌లాంటిదే. అయితే ఎయిర్‌టెల్ యూజ‌ర్లు బాగా ఇష్ట‌పడుతున్న ప్లాన్ ఇది.  349 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 70రోజుల‌పాటు రోజూ 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు  100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  
3) 448 ప్లాన్  
 448 రూపాయ‌ల రీఛార్జితో 70 రోజుల‌పాటు రోజూ 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  దీంతోపాటు రోమింగ్‌లో కూడా అన్‌లిమిటెడ్ అవుట్‌గోయింగ్ కాల్స్ ఫ్రీ ఇస్తుంది.  కొంత‌మంది యూజ‌ర్ల‌కు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వ‌ర‌కు కూడా వ‌స్తోంది. 
4) 549 ప్లాన్  
మొబైల్ డేటా ఎక్కువ అవ‌స‌ర‌మైన వాళ్ల‌కు స్పెసిఫై చేసిన ప్లాన్ ఇది. 549 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 29 రోజుల‌పాటు రోజుకు 2.5 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ.  
5) 799 ప్లాన్  
ఇది కూడా 549 ప్లాన్‌లాంటిదే. 799 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 29 రోజుల‌పాటు రోజుకు 3.5 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ.  రోమింగ్‌లో అవుట్‌గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. 
అయితే వీట‌న్నింటిలోనూ ఫ్రీ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిముషాలు, వారానికి 1000 నిముషాల వ‌ర‌కే లిమిట్ చేసింది. 
 

జన రంజకమైన వార్తలు