• తాజా వార్తలు
  •  

అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించే రూ.500లోపు ఉత్తమ‌మైన డేటా ప్లాన్లు ఇవే

టెలికోస్ వార్‌లో ప్లాన్ల వ‌ర‌ద న‌డుస్తోంది. రోజుకో ప్లాన్ మ‌న‌ల్ని ప‌లుక‌రిస్తోంది.  అన్‌లిమిటెడ్ ఎస్‌టీడీ లోక‌ల్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో పాటు రోజుకు  1 జీబీ డేటా లాంటి ఎన్నోప్లాన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.  జియో రూ.399 ఆఫ‌ర్‌కు పోటీగా  ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో రంగంలోకి దిగాయి. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న రూ.500లోపు  డేటా ప్లాన్లు ఏమిటో చూద్దామా..

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్‌, ఎస్‌టీడీ కాల్స్ (నేష‌న‌ల్ రోమింగ్‌) ల‌భిస్తాయి. దీంతో పాటు రోజుకు 1.5 జీబీ చొప్పున 28 రోజుల పాటు డేటా ల‌భిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు కూడా ల‌భిస్తాయి ఈ ప్లాన్‌తో.  ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ మ‌రొక‌టి. ఈ  ప్లాన్‌తో రోజుకు 1 జీబీ 4జీ డేటా ల‌భిస్తుంది అన్‌లిమిటెడ్   కాల్స్ (లోక‌ల్‌, ఎస్‌టీడీ) కూడా చేసుకోవ‌చ్చు దీని కాల వ్య‌వ‌ధి 35 రోజులు.  448 ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌, ఎస్‌టీడీ కాల్స్ ల‌భిస్తాయి. దీని కాల‌వ్య‌వ‌ధి 70 రోజులు.

రిల‌య‌న్స్ జియో రూ.399 ప్లాన్‌
ఈ ప్లాన్ అంద‌రికి సుప‌రిచిత‌మే. దీంతో  70 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది.  1జీబీ పూర్త‌యితే  64 కేబీపీఎస్‌కు స్సీడ్ తగ్గిపోతుంది. రూ.459 ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది.  వాయిస్ కాల్స్ అద‌నం. ఇదే కాక రూ.459 ప్లాన్‌తో 84 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. రూ.499 ప్లాన్‌లో దీనిలో టాప్ ప్లాన్‌. దీంతో 91 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. ఇవేకాక 3000 ఎస్ఎంఎస్‌లు, ఉచితంగా కాల్స్ చేసుకునే అవ‌కాశం ఉంది.

ఐడియా ప్లాన్లు ఇవే
రూ.499 ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా  91 రోజుల‌పాటు ల‌భిస్తుంది.  అన్‌లిమిటెడ్ లోక‌ల్‌,ఎస్టీడీ కాల్స్ ల‌భిస్తాయి.  రూ.349 ప్లాన్‌తో  28 రోజుల పాటు  రోజుకు 1జీబీ డేటా ల‌భిస్తుంది.  రూ.357 ప్లాన్‌తో 28  రోజుల పాటే 1జీబీ డేటా, వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి.

వొడాఫోన్ ప్లాన్లు ఇవే
రూ.348 ప్లాన్‌తో 28 రోజుల పాటు 28 జీబీ 4జీ డేటా ల‌భిస్తుంది. అంటే రోజుకు 1జీబీ వాడుకోవ‌చ్చు.  దీనిలో వాయిస్ కాల్స్ అద‌నంగా ఉన్నాయి.  వొడాఫోన్‌లో అందిస్తున్న మ‌రో ప్లాన్ రూ.458. దీని కాల‌వ్య‌వ‌ధి 70 రోజులు. రోజుకు 1జీబీ డేటా ల‌భిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వాడుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు