• తాజా వార్తలు
  •  

రూ.999 క‌న్నా త‌క్కువ‌లో ఉన్న ఉత్త‌మమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే

ఇప్పుడు టెలికాం కంపెనీల మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తోంది. మునుపెన్న‌డూ లేన‌ట్లుగా ప్ర‌తి ఒక్క కంపెనీ ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డి ఆఫ‌ర్లు ఇచ్చేస్తున్నాయి. ఒక ఆఫ‌ర్ మార్కెట్లోకి వ‌చ్చిన త‌ర్వాత రోజే  అంత‌కంటే మంచి ఆఫ‌ర్  బ‌య‌ట‌కొస్తోంది. ప్రి పెయిడ్ మాత్ర‌మే కాదు పోస్ట్ పెయిడ్ స‌ర్వీసుల్లోనూ ఇదే పోటీ న‌డుస్తోంది.  జియో రాక‌తో భార‌త టెలికాం ముఖ‌చిత్ర‌మే మారిపోయింది.  జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్ పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నాయి.  మరి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆఫ‌ర్ల‌లో రూ.999లోపు ఉన్న ఉత్తమ‌మైన ఆఫ‌ర్లు ఇవే.

ఎయిర్‌టెల్ ఇన్ఫినెటి ప్లాన్లు 

రూ.399, రూ.499, రూ.649 పోస్ట్‌పెయిడ్ ప్లాను
రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో 10 జీబీ డేటా వ‌స్తుంది. నెక్ట్స్ బిల్లింగ్ సైకిల్ వ‌ర‌కు ఇది 200 జీబీ డేటా రోల్ ఓవ‌ర్ అవుతుంది. డేటాతో పాటు ఉచితంగా కాల్స్ ల‌భిస్తాయి.రూ.499  పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో 20 జీబీ డేటా ల‌భిస్తుంది. దీంతో పాటు ఎస్‌టీడీ, ఫ్రీ రోమింగ్ కాల్స్ ల‌భిస్తాయి.  రూ.649 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో 30 జీబీ డేటా ల‌భిస్తుంది.  ఉచితంగా కాల్స్ ల‌భిస్తాయి.

రూ.799, రూ.999  పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు
రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో 40 జీబీ  డేటా ల‌భిస్తుంది. రూ.999తో 50 జీబీ డేటా ల‌భిస్తుంది. అంతేకాక అన్‌లిమిటెడ్ ఉచితంగా కాల్స్ ల‌భిస్తుంది.

వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్‌ప్లాన్లు
రూ.499, రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు
రూ.499తో రూ.20 జీబీ ప్లాన్లు ల‌భిస్తుంది. అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్ ల‌భిస్తాయి. 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. రూ.699 ప్లాన్‌తో 35 జీబీ   డేటా  లభిస్తుంది.  దీంతో ఫ్రీ అన్‌లిమిటెడ్  కాల్స్ , ఫ్రీ నేష‌న‌ల్ రోమింగ్ కాల్స్ చేసుకోవ‌చ్చు.  100 ఎస్ఎంఎస్‌లు కూడా చేసుకోవ‌చ్చు.

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లు
రూ.309, రూ.409, రూ.509 ప్లాన్లు
 రూ.309 ప్లాన్‌తో 30 జీబీ  డేటా  రోజుకు 1 జీబీ డేటా చొప్పున ల‌భిస్తుంది. ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. రూ. 409 ప్లాన్‌తో 20 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు ల‌భించే డేటా మీద లిమిట్ లేదు. రూ.509 ప్లాన్‌తో 60 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా లిమిట్. వీటితో పాటు ఉచితంగా కాల్స్ అద‌నం. రూ.799 ప్లాన్‌తో 90 జీబీ డేటా రోజుకు 3 జీబీ చొప్పున‌, రూ.999 ప్లాన్‌తో 60 జీబీ రోజుకు 1 జీబీ   చొప్పున లభిస్తుంది.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు