• తాజా వార్తలు

ఎయిర్ టెల్ సిమ్ ఇక మీ ఇంటికే డెలివరీ

దేశంలోని అతిపెద్ద టెలికాం యాగ్రిగేటరీ ప్లాట్ ఫాం 10 డిజీతో భారతీ ఎయిర్ టెల్, మ్యాట్రిక్స్ సంస్థలు చేతులు కలిపాయి. ఎయిర్ టెల్ సిమి్ కార్డులను డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా ఈ సంస్థలు కలిసికట్టుగా పనిచేయనున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీలో
ఇండియాలో 23 శాతం మార్కెట్ షేర్ ఉన్న ఎయిర్ టెల్, టెలికాం సొల్యూషన్లలో దిట్ట అయిన మ్యాట్రిక్స్ లు 10 డిజీతో జత కలిశాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రాంతంలో సర్వీసెస్ అందిస్తున్న 10 డిజి ప్రస్తుతం రోజుకు 150 సిమ్ డెలివరీలు చేస్తోంది. ఈ-కేవీసీ వెరిఫికేషన్ వల్ల నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతోంది.
విస్తరణ వ్యూహం
ఇకపై 10 డిజి సహకారంతో దేశమంతటా ఎయిర్ టెల్ సిమ్ లను ఇళ్ల వద్దకే తెచ్చి ఇచ్చేలా విస్తరణ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మూడు సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే ఎయిర్ టెల్ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరిన్ని సంస్థలతో జత కడతాం
అయితే ఇదే సమయంలో 10 డిజీ మాత్రం తాము కేవలం ఎయిర్ టెల్ కే పరిమితం కాబోమని, అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతోనూ టై అప్ అవుతామని అంటోంది.

జన రంజకమైన వార్తలు