• తాజా వార్తలు

కాల్ డ్రాప్ అయితే రూ.5 ల‌క్ష‌ల ఫైన్ అంటున్న ట్రాయ్‌!

కాల్ డ్రాప్స్ కావ‌డం చాలా స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఇక నుంచి కాల్ డ్రాప్‌లు కుద‌ర‌వ‌ట‌. కాల్‌డ్రాప్ అయితే టెలికాం సంస్థ‌లు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ట‌.  కాల్‌డ్రాప్‌ల విష‌యంలో టెలికాం రెగ్యులెట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) క‌ఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తెచ్చింది.  కాల్‌డ్రాప్స్ విష‌యంలో టెలికాం కంపెనీలు త‌మ నిబంధ‌న‌ల‌ను మీరితే రూ.5 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీని కోసం ట్రాయ్ కొన్ని ప్ర‌త్యేక నిబంధ‌న‌ల‌ను త‌యారు చేసింది. ఇక‌పై ఏ టెలిఫోన్ స‌ర్వీసు ప్రొవైడ‌ర్ అయినా త‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల‌ని ఆదేశించింది. 

నిబంధ‌న‌లు త‌ప్పారో..
కాల్‌డ్రాప్స్ విష‌యంలో ఇక‌పై ఎలాంటి త‌ప్పిదాల‌ను ఊపేక్షించేది లేద‌ని ట్రాయ్ గ‌ట్టిగానే హెచ్చ‌రిస్తోంది. ఒక ఏడాదిలో రెండు అర్ధ‌భాగాల్లో ఎవ‌రైనా త‌మ నిబంధ‌ల‌ను రెండుసార్లు త‌ప్పితే వారికి ఒక‌టిన్న‌ర శాతం ఎక్కువ ఈ జ‌రిమానా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని ట్రాయ్ తెలిపింది. ఒక‌వేళ రెండు క్వార్ట‌ర్స్‌లో రెండు క‌న్నా ఎక్కువ‌సార్లు నిబంధ‌ల‌ను మీరితే ఆ సంస్థ‌ల‌పై క‌నీసం రెండుసార్లు  జ‌రిమానా విధించ‌నున్నారు. అక్టోబ‌ర్ 1 నుంచి ఈ కొత్త‌ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. కేవ‌లం కాల్‌డ్రాప్స్‌కు మాత్ర‌మే కాక క్వాలిటీ ఆఫ్ స‌ర్వీసెస్‌పై కూడా ట్రాయ్ దృష్టి సారించింది.  ఒక స‌ర్వీసు ఏరియాలో నెట్‌వ‌ర్క్ ఎలా ప‌ని చేస్తుందో క్షుణ్నంగా ప‌రిశీలించ‌నుంది. అంటే క్వాలిటీ త‌క్కువ‌గా ఉండి... స‌ర్వీసులో నాణ్య‌త లేక‌పోతే వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు. 

స‌గ‌టు లెక్క‌లు
ఒక ఏరియాలో ఒక నెట్‌వ‌ర్క్ ఫెర్మ‌ర్‌మెన్స్‌ను స‌గ‌టు లెక్క‌ల ప్ర‌కారం కొల‌వ‌నున్నారు. ఒక నెల‌లో నెట్‌వ‌ర్క్ ఫెర్మ‌ర్‌మెన్స్‌ను బ‌ట్టి కాల్‌డ్రాప్స్‌పై ఒక అంచ‌నాకు రానున్నారు. వినియోగ‌దారుల ఫిర్యాదుల ఆధారంగా కూడా స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను లెక్క గ‌ట్ట‌నున్నామ‌ని ట్రాయ్ తెలిపింది. దీని కోసం ట్రాయ్ కొన్ని ప్ర‌త్యేక నిబంధ‌న‌ల‌ను త‌యారు చేసింది. ఒక స‌ర్కిల్‌లో 90 శాతం ట‌వ‌ర్లు 2 శాతం కంటే ఎక్కువగా కాల్‌డ్రాప్స్ ఉండ‌కూడ‌దు. ఇది ఓవ‌రాల్‌గా 90 శాతం ఉండాలి.  ఒక స‌ర్కిల్‌లో  ట‌వ‌ర్లు 3 శాతం కంటే ఎక్కువ‌గా కాల్ డ్రాప్స్ ఉండ‌కూదు. ఇది ఓవ‌రాల్‌గా 97 శాతం ఉండాలి.  వీటిలో ఏది మీరినా క‌చ్చితంగా ఫైన్ త‌ప్ప‌దు.

జన రంజకమైన వార్తలు