• తాజా వార్తలు
  •  

మీ ఆధార్‌తో ఎన్ని జియో సిమ్‌లు లింకై ఉన్నాయో తెలుసుకోవ‌డం ఎలా?

ఇప్పుడు ఇండియాలో మొబైల్ సిమ్ కొనాలంటే ఆధార్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి. అంత‌కుముందు డ్రైవింగ్ లైసెన్స్‌, ఓట‌రు ఐడీ, పాన్ కార్డ్ వంటి ఐడీ ప్రూఫ్‌ల‌తో సిమ్ కార్డు కొన్న‌వాళ్లు కూడా ఫిబ్ర‌వ‌రి 6లోగా ఆధార్‌తో వెరిఫికేష‌న్ చేయించుకోవాల్సిందే.  ఈ ప‌రిస్థితుల్లో మీ ఆధార్ కార్డ్‌తో లింక‌యిన జియో సిమ్‌ల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఓ చిన్న‌ట్రిక్ ఇదీ. 
మీ ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కో మీ ఆధార్ కార్డ్‌తో జియో సిమ్ తీసుకుని ఉంటారు. కానీ త‌ర్వాత ఆ విష‌యం మ‌రిచిపోయి ఉండొచ్చు. అంతెందుకు మీ ఆధార్ డిటెయిల్స్‌తో వేరేవాళ్లు ఎవ‌ర‌న్నా సిమ్ తీసుకున్నారేమోన‌ని మీకు డౌట్ వ‌చ్చి ఉండొచ్చు.  అస‌లు మీ ఆధార్ కార్డ్‌తో ఎన్ని జియో సిమ్‌లు లింక్ అయి ఉన్నాయో తెలుసుకోవ‌డానికి మై జియో యాప్‌లో ఆప్ష‌న్ ఉంది. 
తెలుసుకోవ‌డం చాలా ఈజీ
1. మై జియో (My Jio) యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దాన్ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసుకుని రిజిస్ట‌ర్ చేసుకోండి. 
2. యాప్ ఓపెన్ చేసి మెనూ మీద క్లిక్ చేసి  Recharge ఆప్ష‌న్‌ను ప్రెస్ చేయండి. 
3. Select Recharge ఆప్ష‌న్‌లోకి వెళ్లి Recharge for Another Number Optionను సెలెక్ట్‌చేయండి.
4. ఇప్పుడు మీ జియో నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి. మీ ఆధార్ నెంబ‌ర్‌తో వేరే జియో నెంబ‌ర్స్ కూడా లింక‌యి ఉంటే ఆ నెంబ‌ర్లు డిస్‌ప్లే అవుతాయి. ఇప్ప‌టికే యాప్ ఉన్న‌వాళ్లు రెండో స్టెప్ నుంచి ఫాలో అయితే చాలు.

జన రంజకమైన వార్తలు