• తాజా వార్తలు
  •  

ఐపీఎల్ ఫ్యాన్స్‌ను మోసం చేస్తున్న ఎయిర్‌టెల్‌.. ఢిల్లీ హైకోర్ట్ ధృవీక‌ర‌ణ‌

ఐపీఎల్ అంటే ఇండియాలో ఇప్పుడు ఐపీఎల్ ఫీవ‌ర్ న‌డుస్తోంది.  ఇంట్లో పిల్ల‌ల‌కు ఎగ్జామ్స్ కూడా అయిపోవ‌డంతో చాలా ఇళ్ల‌ల్లో ఫ్యామిలీ అంతా కూర్చుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తున్నారు.  మొబైల్ డేటా కూడా చౌక‌వ‌డంతో టీవీకి ద‌గ్గ‌ర‌లో లేని వారు మొబైల్‌లో లైవ్ చూస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్ కస్ట‌మ‌ర్లు ఐపీఎల్  లైవ్ ఫ్రీగా చూడొచ్చంటూ ఎయిర్‌టెల్ ఇస్తున్న యాడ్స్‌కి ఢిల్లీ హైకోర్టు అక్షింత‌లు వేసింది. వెంట‌నే ఆ యాడ్ మార్చాల‌ని ఆదేశించింది.  దీని వెనుక క‌థేంటో చూడండి
 

జియో ఫిర్యాదు 
టెలికాం సెక్టార్‌లో  ఎయిర్‌టెల్ ఏ చిన్న తప్పుచేసినా దాన్ని అంద‌రికీ చెప్ప‌డానికి జియో సిద్ధంగా ఉంటోంది. గ‌త సంవ‌త్స‌రం ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్‌వ‌ర్క్ త‌మ‌దేనంటూ ఎయిర్‌టెల్ చేసిన ప్ర‌చారాన్ని జియో కోర్టులో స‌వాల్ చేసింది. కోర్టు ఆదేశాల‌తో ఎయిర్‌టెల్ ఆ యాడ్‌ను నిలిపివేసింది. లేటెస్ట్‌గా ఎయిర్‌టెల్ 4జీ సిమ్ తీసుకుంటే ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా లైవ్ చూడ‌వ‌చ్చంటూ ఎయిర్‌టెల్ యాడ్స్ ఇస్తుండడంపై జియో కోర్టుకెళ్లింది. 
హాట్‌స్టార్ యాప్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని లైవ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు.అయితే దీనికి డేటా ఖ‌ర్చువుతుంది. అయితే ఆ యాడ్‌లో ఫ్రీగా లైవ్ చూడొచ్చ‌ని చెప్పారే త‌ప్ప అందుకు డేటా ఛార్జీలు అవుతాయని ఎక్క‌డా  చెప్ప‌లేద‌ని, ఇది క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని జియో యాజ‌మాన్యం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కోర్టు కూడా దీన్ని స‌మ‌ర్థించింది.  క‌స్ట‌మ‌ర్ల‌ను త‌ప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ యాడ్‌ను మార్చాల‌ని ఆదేశించింది. ఇండియాలో ఈ స‌మ్మ‌ర్‌లో అతిపెద్ద ఈవెంట్ అయిన ఐపీఎల్‌ను లైవ్ ఇచ్చి క‌స్ట‌మ‌ర్ల‌ను నిల‌బెట్టుకోవాల‌ని జియో, ఎయిర్‌టెల్ పోటీప‌డుతున్న ప‌రిస్థితుల్లో కోర్టు తీర్పు ఎయిర్‌టెల్‌కు దెబ్బేనంటున్నారు నిపుణులు. 

ప్ర‌చారం ఆగదంటున్న ఎయిర్‌టెల్‌
మా యాడ్స్ క‌రెక్ట్ కాద‌ని ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు.  కోర్టు ఈ ప్ర‌క‌ట‌న‌ల‌కు కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేయ‌మ‌నిఒచెప్పింది అంతే త‌ప్ప వీటిని వేయ‌కూడ‌ద‌ని స్టే ఇవ్వ‌లేదు. కోర్టు ఆర్డ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత మేం స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటాం. మా ప్ర‌చారాన్ని ఆప‌బోమ‌ని ఎయిర్‌టెల్ చెప్పింది.
 

జన రంజకమైన వార్తలు