రిలయన్స్ జియో... ఏడాది క్రితం వరకు మనకు తెలియదు. అసలు ఇది మార్కెట్లోకి అడుగుపెడుతుందని.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందని అసలు ఎవరూ ఊహించలేదు. అయితే జియో రావడం వేగంగా పరిణామాలు రావడం జరిగిపోయాయి. ముఖ్యంగా మిగిలిన టెలికాం కంపెనీలన్నీ దిగొచ్చాయి. ఒకప్పుడు పోటీపడుతూ ధరలు పెంచేసిన ఎయిర్టెల్, ఐడియా లాంటి సంస్థలు సైతం జియో దెబ్బకు దిగొచ్చాయి. ఇప్పుడు పోటీపడుతూ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి ఎదురైంది వాళ్లకు. ఈ నేపథ్యంలో జియో టారిఫ్‌లకు మిగిలిన టారిఫ్‌లకు మధ్య ఏంటి భేదం... అసలు జియో టారిఫ్ వర్సెస్ మిగతా వాళ్ల టారిఫ్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం...
జియో టారిఫ్
జియో ఇటీవలే రూ.399 ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ అమౌంట్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటాతో పాటు వాయిస్ కాల్స్ (లిమిట్ లేదు), 100 ఎస్ఎంఎస్లు 84 రోజుల పాటు లభిస్తాయి. ఈ కొత్త ఆఫర్‌ను ప్రవేపెట్టిన కొన్ని రోజుల తర్వాతే ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా కొత్త ఆఫర్లతో ముందుకొచ్చాయి.
భారతీ ఎయిర్టెల్
టెలికాం మార్కెట్లోకి జియో దూసుకుపోతుండడంతో భారతీ ఎయిర్టెల్ కూడా వేగాన్ని పెంచింది. జియోకు పోటీగా ఇటీవలే ఎయిర్టెల్ కూడా రూ.399 టారిఫ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అందరు కస్టమర్లకు వర్తించే ఈ ఆఫర్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ (రోజుకు 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు) లభిస్తాయి. రూ.348 ప్లాన్ కూడా అచ్చం రూ.399 ప్లాన్ మాదిరిగానే ఉంటుంది,. కానీ దీని వాలీడిటీ 28 రోజులు మాత్రమే. ఎయిర్టెల్ ఆఫర్ చేసిన ప్లాన్స్‌లో రూ.399 ప్లాన్ ఉత్తమమైన ప్లాన్.
ఎయిర్‌సెల్
జియోకు పోటీగా నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చింది ఎయిర్‌సెల్. ఇటీవలే ఈ సంస్థ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో వల్ల 2జీబీ డేటా (రోజుకు)తో పాటు, 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అలాగే రూ.449, రూ.419 (నార్త్ ఈస్ట్ రీజన్స్ కోసం) రెండు ప్లాన్లను కూడా ఎయిర్‌సెల్ లాంఛ్ చేసింది. రూ.229 ప్లాన్‌తో అన్ లిమిటెడ్ కాల్స్ ఎయిర్‌సెల్ టు ఎయిర్‌సెల్ లభిస్తాయి.
వొడాఫోన్ ఇండియా
వొడాఫోన్ కూడా గేరు మార్చింది. జులై నెలలో ఒక్క సారిగా టారిఫ్‌లు విడుదల చేసింది. గోవా, మహారాష్ట్ర సర్కిల్ యూజర్ల కోసం రూ.445 ప్లాన్ రిలీజ్ చేసింది. దీంతో 84 రోజుల పాటు 1జీబీ డేటా రోజుకు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రూ.244 ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు, వొడాఫోన్ టు వొడాఫోన్‌కు 70 రోజుల పాటు ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ కూడా ఈ రేసులో ముందంజలో ఉంది. ఎస్టీవీ ర395 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, 3000 నిమిషాల ఆన్ నెట్ వాయిస్ కాల్స్, 1800 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్ 56 రోజుల పాటు లభిస్తాయి. ఎస్టీవీ 333 ప్లాన్‌తో రోజుకు 3జీబీ డేటా 90 రోజుల పాటు లభిస్తుంది.
రిలయన్స్ కమ్యునికేషన్స్
ఆర్ కామ్ ఇటీవలే రూ.299 టారిఫ్ విడుదల చేసింది. ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు డేటా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.