• తాజా వార్తలు

ఇండియ‌న్ మొబైల్ మార్కెట్  ముఖ‌చిత్రాన్ని  జియో ఎలా మార్చేసింది.. 




జియో.. ఇండియ‌న్ టెలికం రంగంలో పెనుసంచ‌ల‌నం.  నిముషాలు, సెక‌న్ల వారీగా కాల్ రేట్లు, ఎస్ ఎంఎస్‌ల‌కు ఛార్జీలు,  ఇక మొబైల్ డేటా పేరు చెబితే యూజ‌ర్లు కంగారుప‌డేలా కంపెనీల టారిఫ్‌లు. జియో రాక ముందు ఇండియాలో ఇదీ ప‌రిస్థితి.  జియో  గ‌తేడాది మార్కెట్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌రిస్థితి మారిపోయింది. మొద‌ట ఫ్రీగా కాల్స్‌, డేటా వాడుకున్న యూజ‌ర్లు ఇప్పుడు అందుబాటు ధ‌ర‌ల్లోనే వాటిని అందుకోగ‌లుగుతున్నారు. దీంతో మిగిలిన టెలికం కంపెనీల‌న్నీ నేల‌కు దిగి వ‌చ్చి టారిఫ్ లు త‌గ్గించాయి.  
డిజిట‌ల్ ఇండియాకు దారి చూపింది
రిల‌య‌న్స్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ త‌మ జియోతో ఇండియ‌న్  సిటిజ‌న్ల లైఫ్‌ను డిజిటల్ గా మారుస్తామ‌ని చెప్పారు. చెప్పిన‌ట్లే ఇండియాలో చాలా మందికి డిజిట‌ల్ వైపు వెళ్ల‌డానికి జియో దారి చూపింది. ఆన్‌లైన్ పేమెంట్స్‌, డిజిట‌ల్ వాలెట్ల వ్యాపారం, ఈ కామ‌ర్స్ ట్రాన్సాక్ష‌న్లు పెర‌గ‌డానికి జియో పుణ్య‌మే ఎక్కువ‌.  క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ప్ర‌జ‌లు మొబైల్‌ను వాడుకుంటున్నారంటే జియో ఇచ్చిన భ‌రోసానే అని నిస్సందేహ‌గా చెప్పొచ్చు. 

జియో రాక‌తో మారిందిలా.. 
* 125 మిలియ‌న్ల క‌స్ట‌మ‌ర్ల‌ను ఏడాది పూర్తి కాకుండానే జియో సంపాదించుకుంది.  
*  మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాల‌ను దాటి  ఇండియాను నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది.  అంత‌కు ముందు 150వ స్థానంలో ఉన్న ఇండియా ఏకంగా నెంబ‌ర్ వ‌న్ స్థానానికి రావ‌డానికి కార‌ణం జియో ఆఫ‌ర్లు, కాంపిటీట‌ర్ల‌లో అది తెచ్చిన క‌ల‌వ‌ర‌మే. 
* మొబైల్ వీడియో వాచింగ్‌లోనూ ఇండియా రికార్డ్ నెల‌కొల్పింది. 165 కోట్ల గంట‌ల ఆన్ లైన్ వీడియో కంటెంట్ వాచింగ్‌తో ఇండియా టాప్ ప్లేస్ లో నిల‌వ‌డానికి జియో తీసుకొచ్చిన ఆఫ‌ర్లే కార‌ణం.  
* మిగ‌తా టెలికం కంపెనీలు 25 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి 2జీ నెట్‌వ‌ర్క్ నిర్మిస్తే జియో కేవలం మూడేళ్ల‌లోనే అంత‌కంటే ఎంతో అడ్వాన్స్‌డ్ అయిన 4జీ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేయడం గ్రేట్ ఎచీవ్‌మెంట్‌.  
* ఇండియాలో 4జీ క‌వ‌రేజి మొత్తం 2జీ క‌వ‌రేజిని మూడు నెల‌ల్లో దాటేయ‌బోతోంది. ఇది కూడా చాలా పెద్ద రికార్డ్ 
* మొత్తం మన దేశ జ‌నాభాలో 99 శాతం మంది ద‌గ్గ‌ర జియో ఉండే స్థాయికి త్వ‌ర‌లో చేరుకోబోతున్నామ‌ని అంబానీ ప్ర‌క‌టించ‌డం జియో ప్ర‌జ‌ల్లోకి ఎంత‌గా రీచ్ అయ్యిందో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌.
 

 

జన రంజకమైన వార్తలు