• తాజా వార్తలు
  •  

ఏ 4జీ ఫోన్ కొన్నా రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తున్న ఐడియా! నిజ‌మేనా?

టెలికాం రంగంలో యుద్ధం న‌డుస్తోంది ఇప్పుడు. ఎందుకంటే రియ‌ల‌న్స్ జియో మార్కెట్లోక వ‌చ్చిన త‌ర్వాత ఏ ఆఫ‌ర్లు మార్కెట్లోకి వ‌స్తున్నాయో కూడా జ‌నాల‌కు తెలియ‌ట్లేదు. జియో ఉచితంగా నెట్, కాల్స్ ఇచ్చేయ‌డంతో ఆరంభం నుంచే  ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు రేసులో వెన‌క‌బ‌డిపోయాయి. అయితే జియో కూడా నెమ్మ‌దిగా రేట్లు పెంచ‌డంతో ఇప్పుడు ఆ సంస్థ‌లు కూడా జియోను అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీనిలో భాగంగా వీలైనంత ఎక్కువ‌గా ఆఫ‌ర్ల‌ను గుప్పిస్తున్నాయి. దీనిలో భాగంగా ఐడియా మ‌రో బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. అదే 4జీ ఫోన్ కొంటే రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని! మ‌రి ఈ ఆఫ‌ర్ ఎంత‌వ‌ర‌కు నిజం..!

ఫిబ్ర‌వ‌రి 23 నుంచి..
ఐడియా గ‌తంలోనూ కొన్ని ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టింది కానీ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ మాత్రం చాలా పెద్దదే. రూ.2 వేల క్యాష్ బ్యాక్ అన‌గానే జ‌నం కాస్త ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే ఇది నిజ‌మేన‌ని ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఈ ఆఫ‌ర్ అమల్లోకి వ‌చ్చింద‌ని చెబుతోంది ఐడియా. 4జీ స్మార్ట్‌ఫోన్ కొన్న అంద‌రు క‌ష్ట‌మ‌ర్ల‌కు ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అంటే ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని తేడా లేకుండా అంద‌రూ ఈ ఆఫ‌ర్ పొందొచ్చు. ఈ ఆఫ‌ర్ ఈ ఏడాది ఏప్రిల్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటుద‌ని ఐడియా చెబుతోంది. కొత్త 4జీస్మార్ట్‌ఫోన్ కొని త‌మ సిమ్ వేసుకుంటే చాలంట రూ.2 వేలు క్యాష్‌బ్యాక్‌గా అందిస్తామ‌ని చెబుతోంది.

ఆఫ‌ర్ ఎలా ఉప‌యోగించుకోవాలి?
ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవడానికి ఐడియా పోస్ట్ పెయిడ్, ప్రి పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు 36 నెల‌ల బిల్లింగ్ పిరియ‌డ్‌లో మినిమం అమౌంట్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అంటే ఐడియా క‌స్ట‌మ‌ర్లు 18 నెల‌ల‌కు రూ3 వేలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మొద‌ట‌ క్యాష్‌బ్యాక్ రూ.750 వ‌స్తుంది. మిగిలిన క్యాష్‌బ్యాక్ రూ.1250 క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. ఇదే కాక రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ పొందాలంటే నిర్వాణ వాయిస్ కాంబో ప్లాన్స్‌ను కూడా స‌బ్ స్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.                   

జన రంజకమైన వార్తలు