• తాజా వార్తలు

జియో ఫోన్ ఖరీదు జీరో

ముంబయిలోని బిర్లా మాతృశ్రీ సభాగర్ లో ఈ రోజు 11 గంటలకు రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ మొదలైంది. భార్య నీతా అంబానీ సమేతంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హాజరై సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.
    అంతేకాదు... జియో రాకతో దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. టెలికాం రంగం ఎలా పరుగలు తీస్తోంది... ప్రపంచంలో భారత స్థానం ఎలా మారిందన్నది ముకేశ్ వివరించారు. జియోతో దేశంలో డాటా విప్లవం వచ్చిందని చెప్పారు. జియో రాక ముందు మొబైల్ డాటా వినియోగంలో ఇండియా 155వ స్థానంలో ఉండగా జియో వచ్చిన ఆర్నెళ్లలో ఇండియా నంబర్ 1 స్థానానికి చేరినట్లు ఆయన ప్రకటించారు.అలాగే జియో నుంచి ఫ్రీగా దక్కే ఫోన్ ను ప్రకటించారు.
ఇంకా ఏం చెప్పారంటే...
* గత పదినెలలో జియో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించింది. 
* 170 రోజుల్లో 10 కోట్ల మంది కొత్త కస్టమర్లు
* ప్రస్తుతం జియోకు 12.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
* సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియోకు పెరుగుతున్నారు.

జన రంజకమైన వార్తలు