• తాజా వార్తలు
  •  

ఎయిర్‌టెల్ వోల్ట్ లాంచింగ్‌కు ఇది కరెక్ట్ టైమేనా? 

వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ (VoLTE) .. రిల‌య‌న్స్ జియోతో ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్ల‌కు ప‌రిమిత‌మైన ఈ స‌ర్వీస్ ఇప్పుడు ఇండియాలో మిగిలిన కంపెనీలు కూడా అందిపుచ్చుకొంటున్నారు. 3జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ అవ‌డానికి  ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి దేశీయ దిగ్గ‌జ మొబైల్ స‌ర్వీస్ కంపెనీలు నానా తంటాలు ప‌డుతున్న స‌మ‌యంలో  VoLTE ఎనేబుల్డ్ 4జీ స‌ర్వీస్‌తో జియో దూసుకొచ్చింది.  క్వాలిటీ వాయిస్ కాల్స్‌ను ఫ్రీగా ఇచ్చి  మిగిలిన కంపెనీల‌ను వెన‌క్కినెట్టింది. దీంతో ఇప్పుడు మిగిలిన కంపెనీలు VoLTE వెంట ప‌డ్డాయి.  
ఏంటి VoLTE గొప్ప‌? 
VoLTE స‌ర్వీస్ అయితే వాయిస్ కాల్ కాస్ట్ చాలా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. సాధార‌ణ వాయిస్ కాల్స్ రేట్ కంటే ఇది చాలా త‌క్కువ‌. ఇదే థియ‌రీతో, ఈ VoLTE స‌ర్వీస్‌తో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ ఇచ్చి జియో ఇండియాలో సూప‌ర్ హిట్ అయ్యింది. జియోని త‌ట్టుకుని కాంపిటీష‌న్లో పై చేయి సాధించ‌డానికి ఎయిర్‌టెల్ కూడా రీసెంట్‌గా VoLTE స‌ర్వీస్‌ను ముంబ‌యి, గోవా, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌ర్కిల్స్‌లో VoLTE ఎయిర్‌టెల్  హై డెఫినిష‌న్ వాయిస్ స‌ర్వీస్‌ను త‌క్కువ కాస్ట్‌కే అందిస్తుంది. ఫ్రీ వాయిస్‌, వీడియో కాల్స్ ఇస్తున్న కంపెనీల‌కు చెక్‌పెట్ట‌డానికి ఎయిర్‌టెల్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 
ఎయిర్‌టెల్ ఇప్పుడు ప్రారంభించ‌డం క‌రెక్టేనా?
నూటికి నూరుశాతం కరెక్టే. ఎందుకంటే రానున్న రెండేళ్ల‌లో త‌న క‌స్ట‌మ‌ర్లంద‌రినీ 4జీకి షిప్ట్ చేసి 3జీ స‌ర్వీస్‌కు గుడ్‌బై చెప్పేయాల‌ని ఎయిర్‌టెల్ ప్లాన్ చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో మెయింట‌నెన్స్‌, కాల్ కాస్ట్ త‌క్కువ ఉండి మంచి క్వాలిటీ ఇచ్చే  VoLTE స‌ర్వీస్‌ను ప్రారంభించ‌డం ఎయిర్‌టెల్‌కు అవ‌స‌రం కూడా. అంతేకాదు ఇంట‌ర్ యూసేజ్  క‌నెక్ష‌న్‌(IUC) ఛార్జెస్‌ను టెలికాం డిపార్ట్‌మెంట్ నిముషానికి 14 పైస‌ల నుంచి 6 పైస‌ల‌కు త‌గ్గించింది.  2020క‌ల్లా దీన్ని పూర్తిగా ఎత్తేయ‌బోతోంది. ఇది ఎక్కువ క‌స్ట‌మ‌ర్లున్న ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి కంపెనీల‌ను భారీ దెబ్బ కొడుతోంది.  కాబ‌ట్టి ఈ  ప‌రిస్థితుల్లో VoLTE స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌డ‌మే కాదు దేశంలో అన్ని స‌ర్కిల్స్‌కూ  దాన్ని ఎక్స్‌పాండ్  చేయ‌డం ఎయిర్‌టెల్‌కు త‌ప్ప‌నిస‌రి . అదీకాక జియో VoLTEతో హిట్ట‌యినందున యూజ‌ర్ల‌కు కూడా ఈ స‌ర్వీస్ మీద న‌మ్మ‌కం పెరిగింది. కాబ‌ట్టి VoLTE స‌ర్వీస్‌ను ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు