• తాజా వార్తలు
  •  

టెలికోస్ ఇస్తున్న రోజుకి 1 జీబీ ప్లాన్ల‌లో బెస్ట్ ఇవే

టెలికాం వార్ హోరాహోరీగా న‌డుస్తోంది. అన్ని ప్ర‌ధాన టెలికాం కంపెనీలు పోటీప‌డి మ‌రీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. జియో రాక‌తో ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ లాంటి కంపెనీలు భిన్న‌మైన ఆఫ‌ర్ల‌తో ముందుకొచ్చాయి. దాదాపు అన్ని కంపెనీల‌దీ ఒకే అజెండా. రోజుకు 1 జీబీ డేటా ఇవ్వ‌డం. అయితే ఇలా రోజుకు 1 జీబీ డేటా ఇస్తున్నప్లాన్ల‌లో ఏది ఉత్త‌మ‌మైన ప్లాన్‌.

జియో 1 జీబీ డేటా ప్లాన్‌
డేటా ప్లాన్ల‌లో జియో అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది.  దివాళీ టారిఫ్ రివిజ‌న్ త‌ర్వాత జియో రూ.309 ప్లాన్‌ను తీసుకొచ్చింది.  దీంతో 49 రోజుల‌కు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. రూ.399 ప్లాన్‌తో 70 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను మ‌నం వాడుకోవ‌చ్చు. ఇదే కాక రూ.459 ప్లాన్‌తో 84 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. రూ.499 ప్లాన్‌లో దీనిలో టాప్ ప్లాన్‌. దీంతో 91 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. ఇవేకాక 3000 ఎస్ఎంఎస్‌లు, ఉచితంగా కాల్స్ చేసుకునే అవ‌కాశం ఉంది.

ఎయిర్‌టెల్ 1 జీబీ ప్లాన్లు
 జియోతో పోటీగా ఎయిర్‌టెల్ కూడా మంచి ప్లాన్ల‌లో బ‌రిలో దిగింది.  రూ.399 ప్లాన్‌తో  1 జీబీ డేటా ల‌భిస్తుంది. దీంతో  పాటు ఎస్‌టీడీ కాల్స్ 70 రోజుల పాటు ల‌భిస్తాయి. రూ.448 ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు ఎస్‌టీడీ లోక‌ల్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. దీంతో పాటు 100 ఎంఎంఎస్‌లు ల‌భిస్తాయి. రూ.349 ప్లాన్‌తో  28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ  చొప్పున డేటా ల‌భిస్తుంది. దీంతో పాటు 250 నిమిషాల పాటు కాల్స్ ల‌భిస్తాయి. అన్ని ప్లాన్ల‌ల‌కు వారానికి 1000 నిమిషాల  కాల్స్ ల‌భిస్తాయి.

వొడాఫోన్ 1 జీబీ డేటా ప్లాన్లు
ఎయిర్‌టెల్ మాదిరిగానే వొడాఫోన్ కూడా రోజుకు 1 జీబీ  డేటా ప్లాన్లు అందిస్తోంది. రూ.348, రూ.392 ప్లాన్ల‌తో రోజుకు రూ.1 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు.  రోజుకు 1 జీబీ డేటాతో పాటు లోక‌ల్, ఎస్‌టీడీ ప్లాన్లు ల‌భిస్తాయి.  రూ.392 ప్ల‌న్‌తో ఉచితంగా  రోమింగ్ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటా ల‌భిస్తాయి. రూ.348 ప్లాన్‌తో రూ.1.5 జీబీ డేటా ల‌భిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌
రూ.429 ప్లాన్‌తో 90 రోజుల పాటు డేటా, కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్రిపెయిడ్ ఆఫ‌ర్ వ్యాలిడిటీ 90 రోజులు. రూ.498 ప్లాన్‌తో కూడా దాదాపు ఇవే బెనిఫిట్లు లభిస్తాయి. రూ.357 ప్లాన్తో 70 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, ఉచితంగా కాల్స్ ల‌భిస్తాయి.

ఐడియా ప్లాన్లు
రూ. 357 ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటా  ల‌భిస్తుంది.  ఇదేకాక  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అద‌నం. దీని కాల ప‌రిమితి 28 రోజులు. రూ.498 ప్లాన్‌లో కూడా ఇలాంటి బెనిఫిట్సే ఉంటాయి. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు