• తాజా వార్తలు
  •  

జియో టారిఫ్ పెంపులో మంచెంత‌?..  చెడెంత‌?

జియో వినియోగ‌దారులు ఇప్పుడు కొంచెం గందోర‌గోళంలో ఉన్నారు. దీనికి కార‌ణం ఆ సంస్థ టారిఫ్‌ను పెంచాల‌నుకోవ‌డ‌మే. ఇదేగాని జ‌రిగితే ప్లాన్ ధ‌ర‌లు మునుప‌టికంటే క‌చ్చితంగా  ఎక్కువ‌గా ఉంటాయి. ఇప్ప‌టికే రూ.399తో రీఛార్జ్ చేయించుకుని మూడు నెల‌ల‌పాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ పొందుతున్న వినియోగ‌దారుల  కోసం జియో ఇటీవ‌లే మ‌రో ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడు  రూ.399తో రీఛార్జ్ చేయించుకుంటే 100 శాతం   క్యాష్‌బాక్ అని చెప్పింది. తాజాగా మ‌ళ్లీ టారిఫ్ పెంచుతోంద‌న్న వార్త‌ల‌తో అంతా గంద‌ర‌గోళం..మ‌రి  దీని వ‌ల్ల మంచెంత‌? .,చెడెంత‌?

రూ.399 కాదు రూ.459

ప్రిపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం జియో టారిఫ్ ప్లాన్‌ను రివైజ్ చేసింది.  ప్ర‌స్తుతం ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న జియో ప్లాన్ రూ.399.  ఇప్పుడు ఈ ప్లాన్‌ను రూ459కి మార్చ‌నుంది ఆ సంస్థ‌. అంటే మునుప‌టి కంటే 15 శాతం టారిఫ్ పెర‌గ‌నుంది.  రూ.399 ప్లాన్‌కు వర్తించిన‌ట్లే  రోజుకు 1జీబీ డేటా చొప్పున మూడు నెల‌ల‌పాటు 84 జీబీ డేటా ల‌భిస్తుంది. ఇక ఈ ప్లానే స్టాండ‌ర్డ్‌గా ఉంచాల‌ని  జియో భావిస్తోంది.  అలాగే రూ.149 ప్లాన్ ఉప‌యోగిస్తున్న వినియోగ‌దారులు 28 రోజుల‌కు 2జీబీ డేటా బ‌దులు 4జీబీ డేటా పొంద‌నున్నారు. ఈ విష‌యంలో వారు ల‌బ్ది పొందిన‌ట్లే.  ఇదే కాక రూ.52 ప్లాన్  (7 రోజుల‌కు 1.05 జీబీ) , రూ.4999 (360 రోజుల‌కు  350 జీబీ) కూడా అందుబాటులోకి రానున్నాయి.

పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా..

టారిఫ్ పెంచ‌డం వ‌ల్ల పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా ఛేంజ్ కానున్నాయి. గ‌తంలో రూ.309 (60 జీబీ), రూ.509 (120 జీబీ) ప్లాన్లు దీనిలో  ఉండేవి. ఇప్పుడు  దీన్ని ఐదు ప్లాన్స్‌గా మార్చారు .

రూ.309 (30 జీబీ, రోజుకు 1 జీబీ)

రూ.409 (20 జీబీ, నో లిమిట్‌)

రూ.509 (60 జీబీ, 2 జీబీ లిమిట్‌)

రూ.799 (90 జీబీ, 3 జీబీ లిమిట్‌)

రూ.999 (60 జీబీ, నో లిమిట్‌)                                                                                                                           

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు