• తాజా వార్తలు

ప్ర‌స్తుతం జియో పోస్ట్ పెయిడ్‌, ప్రి పెయిడ్ ప్లాన్లు అనీ ఒకచోట మీకోసం

జియో భార‌త్‌లోకి అడుగుపెట్టిన త‌ర్వాత టెలికాం రంగం ముఖ చిత్ర‌మే మారిపోయింది.  ఒక‌ప్పుడు రూ.200 పెట్టినా ఒక జీబీ డేటా రాని  ప‌రిస్థితి ఉండేది.  అలాంటిది జియో ఏకంగా ఆరు నెల‌ల పాటు  రోజుకు ఒక జీబీ  డేటాను  అందించి  ప్ర‌కంప‌న‌లే రేపింది. అలాగే ఉచిత కాల్స్‌, ఉచిత ఎంఎంఎస్‌ల‌తో త‌న పోటీ సంస్థ‌ల‌ను వ‌ణికించింది ముఖేశ్ అంబాని సంస్థ‌. జియో వ‌చ్చిన నాటి నుంచి టారిఫ్‌ల్లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఇటీవ‌లే ఆ సంస్థ కొత్త టారిప్‌ల‌ను అనౌన్స్ చేసింది. మ‌రి  ప్ర‌స్తుతం జియో ప్రిపెయిడ్‌, పోస్ట్ పెయిడ్ టారిఫ్ ప్లాన్లు ఏమిటో చూద్దామా..

జియో ప్రిపెయిడ్ ప్లాన్స్‌
రూ.9999

జియో ప్రిపెయిడ్‌లో ఉన్న‌మోస్ట్  ఎక్స్‌పెన్సీవ్ ప్లాన్ ఇది.  రూ.9999 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 360 రోజుల‌కు 750 జీబీ  డేటా లభిస్తుంది. ప్ర‌తి రోజూ ఇంతే వాడాలి అనే నియంత్ర‌ణ లేదు. ఫ్రీ వాయిస్ కాల్స్‌, మెసేజ్‌లు ఎలాగో ఉంటాయి.

రూ.4999
రూ.4999 ప్యాక్ వేయించుకుంటే    360 రోజుల పాటు 350జీబీ హైస్పీడ్ డేటా ల‌భిస్తుంది. డైలీ లిమిట్ ఏమి లేదు. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ంఎస్‌లు ల‌భిస్తాయి. యాప్స్ కూడా ఉచితంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చు.

రూ.1999
దీని వ్యాలిడిటీ 180 రోజులు. రూ.1999తో రీఛార్జ్ చేయించుకుంటే 125 జీబీ డేటా ల‌భిస్తుంది. ఫ్రీకాల్స్‌, ఎంఎంఎస్‌ల‌తో పాటు యాప్స్‌ను ఉచితంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చు. 

రూ.999
రూ.999తో రీఛార్జ్ చేయించుకుంటే 90 రోజుల పాటు 60 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా రోజుకు ఇంత వాడాల‌నే నిబంధన లేదు. 

రూ.799
ఈ ప్యాక్ కేవ‌లం  ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్ బ‌య‌ర్స్‌కు మాత్ర‌మే. రూ.799 తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు 3 జీజీ హైస్పీడ్ డేటా ల‌భిస్తుంది.  దీని వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.399 ప్లాన్‌
జియో ప్లాన్స్ అన్నింట్లో కెల్లా బాగా విజ‌య‌వంతం అయిన ప్లాన్ ఇదే. రూ.399తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు 1జీబీ చొప్పున 84 రోజుల పాటు డేటాతో పాటు, వాయిస్ కాల్స్, మెసేజ్‌లు పొందొచ్చు.  ఇటీవ‌లే ఈ ప్లాన్‌ను  రూ.399 నుంచి 459కి మార్చారు. 

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌
రూ.999

రూ.999 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 60 జీబీ హైస్పీడ్ డేటా ల‌భిస్తుంది. రోజుకు ఇంత డేటా వాడాల‌నే రూల్ లేదు.  ఉచిత కాల్స్‌, మెసేజ్‌లు ల‌భిస్తాయి. అయితే  ఈప్లాన్ వాడాలంటే రూ.1150 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటంది,

రూ.799
ఈ ప్లాన్ వేయించుకున్న వారికి 90 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 3జీబీ డేటా  వాడుకోవ‌చ్చు. ఇదే కాక ఎస్ంఎంఎస్‌, కాల్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్ కోసం రూ.950 సెక్యూరిటీ డిపాజిట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్ల‌స్ వినియోగదారుల‌కు మాత్ర‌మే.  

రూ.509
ఈ ప్లాన్ వాడాలంటేరూ.600 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుంది. మొత్తం మీద 60 జీబీ డేటా దీంతో పొందొచ్చు. ఉచిత కాల్స్‌, మెసేజ్‌లు  ల‌భిస్తాయి.  

రూ.409
కొత్త టారిఫ్ లో వ‌చ్చిన  ప్లాన్‌లో రూ.409 ఒక‌టి. దీంతో 20 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజూ ఇంత వాడాల‌నే లిమిట్ లేదు. కాల్స్‌, ఎస్ఎంఎస్ వాడుకోవ‌చ్చు. దీనికి రూ.500 సెక్యూరిటీ డిపాజిట్‌గా క‌ట్టాలి. 

రూ.309
ఇది వాడాలంటే రూ.400 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. రోజుకు 1జీబీ   డేటా ల‌భిస్తుంది ఈ ప్లాన్‌తో.  కాల్స్‌,  మెసేజ్‌లు వాడుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు