అసుస్ ఫోన్లు కొనేవారికి బంపర్ ఆఫర్ తగిలింది. 10 నెలల పాటు నెలకు 10 జీబీ జియో 4జీ డేటా చొప్పున మొత్తం 100 జీబీ డేటా ఉచితంగా దొరుకుతోంది. ఈ ఏడాది జూన్ 16 తరువాత అసుస్ స్మార్ట్ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
యాక్టివేషన్ ఇలా..
తమ జియో సిమ్‌ను అసుస్ ఫోన్లో వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు. దానికి వచ్చే రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది. యూజర్లు ఇలా మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు.
ఏఏ మోడళ్లకు ఎంత డాటా.
* అసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఫ్రీ.
* జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా.
* జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా ఉచితం.