• తాజా వార్తలు

జియో కొత్త టారిఫ్ లు ఇలా..


రిలయన్స్ తన డాటా ప్లాన్లను సవరించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఈ మార్పులు చేసింది. పాత ధరల్లోనే ప్లాన్లు ఉన్నప్పటికీ డాటా వినియోగ పరిమితి మాత్రం పెంచారు. జియో ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.19 నుంచి రూ.9999 వరకు ఉన్నాయి. పోస్టు పెయిడ్ లో రూ.309, రూ. 509, రూ.999 ప్లాన్లు ఉన్నాయి. ఇంతకుముందు రూ.303.. రూ.499 ప్లాన్లు ఉండేవి.

రూ.309 నుంచి ఉన్న ప్లాన్లన్నీ జియో ప్రైమ్ మెంబర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. నాన్ ప్రైం మెంబర్లంతా రూ. 19 నుంచి రూ. 149 మధ్యే వాడుకోవాలి.

ప్రీపెయిడ్..
* రూ.19తో రీచార్జి చేయించుకుంటే ఒక రోజు మాత్రమే వేలిడిటీ ఉంటుంది. ప్రైమ్ మెంబర్లకైతే 200 ఎంబీ డాటా వస్తుంది. నాన్ ప్రైమ్ మెంబర్లకైతే 100 ఎంబీ మాత్రమే వస్తుంది.
* రూ.49తో చేయిస్తే ప్రైమ్ మెంబర్లకు 600 ఎంబీ, నాన్ ప్రైం మెంబర్లకు 300 ఎంబీ డాటా వస్తుంది.
* రూ.96తో చేయిస్తే ప్రైమ్ మెంబర్లకు రోజుకు 1 జీబీ చొప్పున 7 జీబీ... నాన్ ప్రైం మెంబర్లకు 600 ఎంబీ డాటా వస్తుంది.
* రూ.149తో చేయిస్తే ప్రైమ్ మెంబర్లకు 2 జీబీ, నాన్ ప్రైం మెంబర్లకు 1జీబీ డాటా వస్తుంది.
* రూ.309తో చేయిస్తే ప్రైమ్ మెంబర్లకు 84 రోజుల పాటు రోజుకు 1 జీబీ చొప్పున 84 జీబీ... నాన్ ప్రైం మెంబర్లకు 300 ఎంబీ డాటా వస్తుంది.
* ఇలా మిగతా ప్లాన్లకూ వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించింది. అన్నిటికీ వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ ఫ్రీ

పోస్ట్ పెయిడ్..
* అన్నిటికీ ఫ్రీ రోమింగ్
* రూ.309 ప్లానుతో మొదటి సారి రీఛార్జి చేయిస్తే 90 రోజుల పాటు రోజుకు 1 జీబీ చొప్పున 90 జీబీ ఇస్తారు. ఆ తరువాత నుంచి నెలకు 30 జీబీ మాత్రమే ఇస్తారు.
* రూ. 509కి మొదటి రీఛార్జిలో 180 జీడీని రోజుకు 2 జీబీ లెక్కన ఇస్తారు. మూడు నెలల తరువాత నుంచి ప్రతి రీఛార్జికి 60 జీబీ వస్తుంది. అంటే నెలరోజులే ఉంటుంన్నమాట. రూ. 999 రీఛార్జికి తొలిసారి మూడు నెలలకు 180 జీబీ ఇస్తారు. అయితే.. రోజుకు 1 జీబీ అన్న పరిమితి లేదు.

జన రంజకమైన వార్తలు