• తాజా వార్తలు
  •  

టెలికాం ఆపరేటర్ల రూ.300లోపు ప్లాన్లుల్లో ఏది బెస్టు?

ప్ర‌స్తుతం జియో వార్ నడుస్తోంది. మిగిలిన టెలిఫోన్ ఆప‌రేటర్ల‌కు జియోకు ప్ర‌తి విష‌యంలోనూ పోటీ ఉంది. అందుకే జియో ఏ ఆఫ‌ర్ ప్ర‌క‌టించినా త‌ర్వాత రోజే మిగిలిన ఆప‌రేట‌ర్లు కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి.  మ‌రి జియో వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ ఐడియా వ‌ర్సెస్ బీఎస్ఎన్ఎల్ పోటీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే రూ.300లోపు బెస్ట్ రీఛార్జ్ ఆఫ‌ర్లు ఎవ‌రు ఇస్తున్నారో చూద్దామా...

రూ.300లోపు జియో రీఛార్జ్‌లు
ఇటీవ‌లే జియో రూ.251 రీఛార్జ్‌ను ప్ర‌క‌టించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో చూసేందుకు జియో ఈ ఆఫ‌ర్ తెచ్చింది. రూ.251 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుంది. దీంతో పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవ‌చ్చు. రోమింగ్ ఛార్జీలు లేవు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. రూ.299 రీఛార్జ్‌తో మీకు రోజుకు 3జీబీ డేటా 28 రోజుల పాటు ల‌భిస్తుంది. రూ.199 ప్రిపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకు 2 జీబీ డైలీ డేటా 28 రోజుల పాటు ల‌భిస్తుంది.

ఎయిర్ టెల్ రీఛార్జ్ రూ.300 లోపు
రూ.249 రీఛార్జ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది ఎయిర్‌టెల్‌. దీంతో రోజుకు 2 జీబీ డేటా 28 రోజుల పాటు ల‌భిస్తుంది. ఫ్రీ రోమింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు, బండిల్డ్ కాల్స్ (రోజుకు 300 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు) ల‌భిస్తాయి. మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ రీఛార్జ్ ఆఫ‌ర్‌ను పొందొచ్చు. ఇదే కాక రూ.199 ఆఫ‌ర్‌తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా 28 రోజుల పాటు ల‌భిస్తుంది.

వోడాఫోన్ రీఛార్జ్ రూ.300లోపు
రూ.199తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా  28 రోజుల వ్యాలిడిటీతో ల‌భిస్తుంది. ఈ డేటాతో పాటు యూజర్లు బండిల్డ్ కాల్స్ (రోజుకు 250 నిమిషాలు... వారానికి 1000 నిమిషాలు) పొందొచ్చు. ఫ్రీ రోమింగ్‌, 100 ఎస్ఎంఎస్‌లతో పాటు వొడాఫోన్ ప్లే యాప్‌లోకి యాక్సిస్ ఉంటుంది. 

ఇడియా రీఛార్జ్ రూ.300 లోపు
రూ.199తో రీఛార్జ్  చేయించుకుంటే రోజుఉకు 1.4 జీబీ డేటా. 28 రోజుల పాటు ల‌భిస్తుంది. బండిల్డ్ కాల్స్ (రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు) ల‌భిస్తాయి. ఫ్రీ రోమింగ్‌.. 100 ఎస్ఎంఎస్‌లు, ఐడియా యాప్స్‌లోకి యాక్సిస్ దొరుకుతుంది. రూ.179తో రీఛార్జ్ చేయిస్తే రోజుకు 1 జీబీ డేటా... 28 రోజుల పాటు పొందొచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ.300లోపు రీఛార్జ్‌
రూ.248తో రీఛార్జ్ చేయిస్తే రోజుకు 3 జీబీ డేటా 51 రోజుల పాటు ల‌భిస్తుంది. ఏప్రిల్ 30లోపు రీఛార్జ్ చేయించుకున్న‌వాళ్ల‌కే ఇది వ‌ర్తిస్తుంది. రూ.118తో రీఛార్జ్ చేయిస్తే 1 జీబీ డేటా ల‌భిస్తుంది. అయితే ఇది త‌మిళ‌నాడు స‌ర్కిల్‌కు మాత్ర‌మే. 

జన రంజకమైన వార్తలు